నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు: సీపీ

దిశ, క్రైమ్‌బ్యూరో : నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు ఎంతో కీల‌క‌మైన పాత్ర పోషిస్తాయని హైద‌రాబాద్ నగర సీపీ అంజ‌నీ కుమార్ అన్నారు. బంజారాహిల్స్‌లోని ఎమ్మెల్యే కాల‌నీ శ్రీవెంక‌టేశ్వ‌ర బిల్డింగ్ సొసైటీ క‌మిటీ ఆధ్వ‌ర్యంలో బృహ‌స్ప‌తి టెక్నాల‌జీ సంస్థ‌ ఏర్పాటు చేసిన‌ సీసీ కెమెరాల కంట్రోల్ రూంను సీపీ బుధవారం ప్రారంభించారు. అనంతరం సీపీ అంజనీకుమార్ మాట్లాడుతూ.. సీసీ కెమెరాల ద్వారా 50 శాతానికి పైగా నేరాల‌ను అదుపు చేస్తున్న‌ట్లు తెలిపారు. ఒక్క సీసీ కెమెరా వంద […]

Update: 2021-01-06 11:45 GMT

దిశ, క్రైమ్‌బ్యూరో : నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు ఎంతో కీల‌క‌మైన పాత్ర పోషిస్తాయని హైద‌రాబాద్ నగర సీపీ అంజ‌నీ కుమార్ అన్నారు. బంజారాహిల్స్‌లోని ఎమ్మెల్యే కాల‌నీ శ్రీవెంక‌టేశ్వ‌ర బిల్డింగ్ సొసైటీ క‌మిటీ ఆధ్వ‌ర్యంలో బృహ‌స్ప‌తి టెక్నాల‌జీ సంస్థ‌ ఏర్పాటు చేసిన‌ సీసీ కెమెరాల కంట్రోల్ రూంను సీపీ బుధవారం ప్రారంభించారు. అనంతరం సీపీ అంజనీకుమార్ మాట్లాడుతూ.. సీసీ కెమెరాల ద్వారా 50 శాతానికి పైగా నేరాల‌ను అదుపు చేస్తున్న‌ట్లు తెలిపారు. ఒక్క సీసీ కెమెరా వంద మంది పోలీసుల‌తో స‌మాన‌మ‌ని అన్నారు. అందుకే ప్ర‌తి కాల‌నీలోనూ సీసీ కెమెరాల‌ను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.

Tags:    

Similar News