పోయిందనుకున్న పులి మళ్లొచ్చింది..

దిశ,వెబ్‌డెస్క్ : కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండలం తలాయి అటవీ ప్రాంతంలో పులి సంచారం కలకలం రేపింది. ఇన్నిరోజులు సైలంట్‌గా ఉన్న పులి పశువుల మందపై ఒక్కసారిగా దాడి చేసింది.ఈ దాడిలో ఆవు మరణించినట్లు పశువుల కాపరి తెలిపాడు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అటవీ ప్రాంతంలో వెళ్లిపోయిందని అనుకున్న పులి మళ్లీ తిరిగి రావడంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. కాగా, మ్యాన్ ఇటర్ పులిని పట్టుకునేందుకు అటవీశాఖ అధికారులు ఎన్ని ప్రయత్నాలు చేసినా అది […]

Update: 2021-02-02 23:26 GMT

దిశ,వెబ్‌డెస్క్ : కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండలం తలాయి అటవీ ప్రాంతంలో పులి సంచారం కలకలం రేపింది. ఇన్నిరోజులు సైలంట్‌గా ఉన్న పులి పశువుల మందపై ఒక్కసారిగా దాడి చేసింది.ఈ దాడిలో ఆవు మరణించినట్లు పశువుల కాపరి తెలిపాడు.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అటవీ ప్రాంతంలో వెళ్లిపోయిందని అనుకున్న పులి మళ్లీ తిరిగి రావడంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. కాగా, మ్యాన్ ఇటర్ పులిని పట్టుకునేందుకు అటవీశాఖ అధికారులు ఎన్ని ప్రయత్నాలు చేసినా అది బూడిదలో పోసిన పన్నీరులా మారింది. ఇప్పటికీ చుట్టుపక్కల అటవీ ప్రాంతాల్లో అధికారులు బోన్లు, ఎరల సాయంతో పులిని పట్టుకోవాలని నానా ప్రయత్నాలు చేస్తు్న్నారు.

Tags:    

Similar News