కొవిషీల్డ్ వ్యాక్సిన్: గ్యాప్ పెంచండి
దిశ, వెబ్‌డెస్క్: దేశంలో కరోనా వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమం జోరుగా జరుగుతోంది. ప్రస్తుతం 60 ఏళ్లు పైబడిన వారితో పాటు 45 ఏళ్లు పైబడి ఇతర వ్యాధులతో బాధపడుతున్న వారికి వ్యాక్సిన్ అందిస్తున్నారు. భారత్ బయోటెక్ తయారుచేసిన కోవాగ్జిన్‌తో పాటు ఆక్స్‌ఫోర్డ్-ఆస్ట్రాజెనెకాలతో కలిసి సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తయారుచేసిన కొవిషీల్డ్ వ్యాక్సిన్‌ను ప్రస్తుతం అందిస్తున్నారు. అయితే తాజాగా కొవిషీల్డ్ వ్యాక్సిన్‌కి సంబంధించి రాష్ట్రాలకు ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. కొవిషీల్డ్ వ్యాక్సిన్ రెండు డోస్‌లు […]
దిశ, వెబ్‌డెస్క్: దేశంలో కరోనా వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమం జోరుగా జరుగుతోంది. ప్రస్తుతం 60 ఏళ్లు పైబడిన వారితో పాటు 45 ఏళ్లు పైబడి ఇతర వ్యాధులతో బాధపడుతున్న వారికి వ్యాక్సిన్ అందిస్తున్నారు. భారత్ బయోటెక్ తయారుచేసిన కోవాగ్జిన్‌తో పాటు ఆక్స్‌ఫోర్డ్-ఆస్ట్రాజెనెకాలతో కలిసి సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తయారుచేసిన కొవిషీల్డ్ వ్యాక్సిన్‌ను ప్రస్తుతం అందిస్తున్నారు.
అయితే తాజాగా కొవిషీల్డ్ వ్యాక్సిన్‌కి సంబంధించి రాష్ట్రాలకు ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. కొవిషీల్డ్ వ్యాక్సిన్ రెండు డోస్‌లు మధ్య గ్యాప్‌ను 6 నుంచి 8 వారాలకు పెంచాలని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది. కొవిషీల్డ్ వ్యాక్సిన్‌కు మాత్రమే ఈ ఆదేశాలు వర్తిస్తాయని, కోవాగ్జిన్‌కి కాదంది.
ప్రస్తుతం రెండు డోస్‌ల మధ్య గ్యాప్ 4 నుంచి 8 వారాలుగా ఉంది. అయితే కొవిషీల్డ్ వ్యాక్సిన్‌కి సంబంధించి మెరుగైన ఫలితం రావాలంటే.. రెండు డోస్‌ల మధ్య గ్యాప్‌ను పెంచాలని నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్, నేషన్ ఎక్స్‌పర్ట్ కమిటీలు ఇటీవల సూచించాయి. వారి సూచనల మేరకు గ్యాప్ పెంచాల్సిందిగా రాష్ట్రాలకు కేంద్రం సూచించింది.