దేశవ్యాప్తంగా కొవిడ్ వ్యాక్సినేషన్ సక్సెస్
దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా నిర్వహించిన అతిపెద్ద కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ విజయవంతం అయిందని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. వ్యాక్సిన్ వేసుకున్న వారు ఏ ఒక్కరూ కూడా అస్వస్థతకు గురి కాలేదని స్పష్టం చేసింది. కోవాగ్జిన్, కోవిషీల్డ్ వ్యాక్సిన్లు తీసుకున్నవారికి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రాలేదని.. తొలిరోజు టీకా తీసుకున్న 1,65,714 మంది పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని వెల్లడించింది. ఈ నేపథ్యంలోనే వ్యాక్సినేషన్ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.