డోర్ టూ డోర్ ప్రచారం.. నో మాస్క్… నో ఓట్
దిశ, తెలంగాణ బ్యూరో : కరోనా సెకెండ్ వేవ్ వ్యాపిస్తున్న నేపథ్యంలో స్థానిక ప్రచారానికి నిబంధనలను విధిస్తూ ఎస్ఈసీ ఆదేశాలిచ్చింది. రెండు కార్పొరేషన్లు, ఐదు మున్సిపాలిటీల ఎన్నికలతో పాటుగా జీహెచ్ఎంసీ 18వ డివిజన్, మరో 8 మున్సిపాలిటీల్లో 8 వార్డులకు నిర్వహిస్తున్న ఉప ఎన్నికల్లో కొవిడ్ నిబంధనలు పాటించాలని సూచించారు. ప్రచార బృందంలో అభ్యర్థితో సహా ఐదుగురు మాత్రమే ఉండాలని, ఐదుగురికి మించి ఉండకూడదని సూచించారు. డోర్ టూ డోర్ ప్రచారానికి ఐదుగురు మాత్రమే వెళ్లాలని, ఇంటి […]
దిశ, తెలంగాణ బ్యూరో : కరోనా సెకెండ్ వేవ్ వ్యాపిస్తున్న నేపథ్యంలో స్థానిక ప్రచారానికి నిబంధనలను విధిస్తూ ఎస్ఈసీ ఆదేశాలిచ్చింది. రెండు కార్పొరేషన్లు, ఐదు మున్సిపాలిటీల ఎన్నికలతో పాటుగా జీహెచ్ఎంసీ 18వ డివిజన్, మరో 8 మున్సిపాలిటీల్లో 8 వార్డులకు నిర్వహిస్తున్న ఉప ఎన్నికల్లో కొవిడ్ నిబంధనలు పాటించాలని సూచించారు. ప్రచార బృందంలో అభ్యర్థితో సహా ఐదుగురు మాత్రమే ఉండాలని, ఐదుగురికి మించి ఉండకూడదని సూచించారు. డోర్ టూ డోర్ ప్రచారానికి ఐదుగురు మాత్రమే వెళ్లాలని, ఇంటి బయట నుంచే ప్రచారం చేసుకోవాలని, గుంపుగా ఇండ్లలోకి వెళ్లరాదని ఆంక్షలు విధించారు. అదే విధంగా ప్రతి అభ్యర్థి రెండు వాహనాలను మాత్రమే వినియోగించాలని, వాహనాల్లో ఒక్కొక్కరికి 10 మీటర్ల గ్యాప్ ఉండాలని, రోడ్‌షోలను ఒక పార్టీ నిర్వహించిన అరగంటకు మరో పార్టీకి అవకాశం ఇవ్వాలని సూచించారు.
ఇక దివ్యాంగులు, 80 ఏండ్ల పైబడిన వారితో పాటుగా కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయిన ఓటర్లకు పోస్టల్ బ్యాలెట్ అవకాశం కల్పించారు. అదే విధంగా పోలింగ్ కు ముందు రోజు కేంద్రాలను పూర్తిగా శానిటైజ్ చేయాలని, పోలింగ్ కేంద్రాల్లో సోషల్ డిస్టెన్స్ పాటించాలని, మాస్క్ లేకుంటే ఓటర్లను పోలింగ్ కేంద్రాల్లోకి రానీవ్వమంటూ ఎస్ఈసీ హెచ్చరించింది. పోలింగ్ కేంద్రాలకు రావడం, వెళ్లడం దారుల్లో శానిటైజర్లు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. పోలింగ్ కేంద్రాల్లో అనువుగా ఉండే స్థలం ప్రకారం ఖచ్చితంగా 6 ఫీట్ల దూరం ఉండాలని, ఒకేసారి కేంద్రాల్లోకి 15 మంది కంటే ఎక్కువ అనుమతించరని సూచించారు.