కోవిడ్ ఆంక్షల్లో భద్రాద్రి రామాలయం.. సేవలు రద్దు

దిశ, తెలంగాణ బ్యూరో: కోవిడ్ సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రముఖ పుణ్యక్షేత్రం భద్రాద్రి సీతారాముల దేవస్థానంలో ఆంక్షలను విధిస్తూ దేవదాయ శాఖ నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా.. అంతరాలయంలో జరిగే అన్ని పూజలు, సేవలు రద్దు చేస్తున్నట్లు ఆదివారం ఆలయ ఈవో ప్రకటించారు. దీంతో సోమవారం నుంచి ఈ నెల 30 వరకూ ఆలయంలో ఎలాంటి పూజలు జరిపేందుకు భక్తులను అనుమతించరు. అంతేకాకుండా శ్రీరామనవమి సందర్భంగా ఈ నెల 21,22 తేదీల్లో ఆలయంలో జరిగే వేడుకలకు […]

Update: 2021-04-18 08:05 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: కోవిడ్ సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రముఖ పుణ్యక్షేత్రం భద్రాద్రి సీతారాముల దేవస్థానంలో ఆంక్షలను విధిస్తూ దేవదాయ శాఖ నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా.. అంతరాలయంలో జరిగే అన్ని పూజలు, సేవలు రద్దు చేస్తున్నట్లు ఆదివారం ఆలయ ఈవో ప్రకటించారు. దీంతో సోమవారం నుంచి ఈ నెల 30 వరకూ ఆలయంలో ఎలాంటి పూజలు జరిపేందుకు భక్తులను అనుమతించరు. అంతేకాకుండా శ్రీరామనవమి సందర్భంగా ఈ నెల 21,22 తేదీల్లో ఆలయంలో జరిగే వేడుకలకు కూడా భక్తులకు అనుమతి లేదు. కల్యాణం సందర్భంగా ఏర్పాటుచేసే అన్నదాన కార్యక్రమం కూడా రద్దు చేస్తున్నట్లు ఈవో తెలిపారు.

Tags:    

Similar News