అలర్ట్ : పరిగిలో కరోనా పాజిటివ్ కేసు

దిశ, పరిగి : వికారాబాద్ జిల్లా పరిగి మండలంలో ఒకరికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. చిట్యాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ నవ్య కథనం ప్రకారం.. పరిగి మండలం రూప్​ఖాన్​పేట్ గ్రామానికి చెందిన 65 ఏళ్ల వ్యక్తి మూడ్రోజులుగా జలుబు, గొంతునొప్పితో బాధపడుతున్నాడు. పరిగి ప్రభుత్వాస్పత్రిలో కొవిడ్–19 పరీక్షల నిమిత్తం శాంపిల్స్ ఇవ్వగా వికారాబాద్‌లో ఆర్టీపీసీఆర్ టెస్టు చేయించారు. శుక్రవారం కొవిడ్–19 పాజిటివ్ నిర్ధారణ అయినట్టు వైద్యులు తెలిపారు. కాగా, పాజిటివ్ వచ్చిన వ్యక్తి వారం […]

Update: 2021-12-17 08:06 GMT

దిశ, పరిగి : వికారాబాద్ జిల్లా పరిగి మండలంలో ఒకరికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. చిట్యాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ నవ్య కథనం ప్రకారం.. పరిగి మండలం రూప్​ఖాన్​పేట్ గ్రామానికి చెందిన 65 ఏళ్ల వ్యక్తి మూడ్రోజులుగా జలుబు, గొంతునొప్పితో బాధపడుతున్నాడు. పరిగి ప్రభుత్వాస్పత్రిలో కొవిడ్–19 పరీక్షల నిమిత్తం శాంపిల్స్ ఇవ్వగా వికారాబాద్‌లో ఆర్టీపీసీఆర్ టెస్టు చేయించారు.

శుక్రవారం కొవిడ్–19 పాజిటివ్ నిర్ధారణ అయినట్టు వైద్యులు తెలిపారు. కాగా, పాజిటివ్ వచ్చిన వ్యక్తి వారం రోజుల కిందట పెళ్లి వేడుకల కోసం హైదరాబాద్, ఇతర ప్రాంతాలకు వెళ్లినట్టు వైద్యులు తెలిపారు. పాజిటివ్​వచ్చిన వ్యక్తి మరో ఏడుగురితో ప్రైమరీ కాంటాక్టులో ఉన్నట్టు గుర్తించారు. వెంటనే అతన్ని ఐసోలేషన్ సెంటర్‌కు తరలించి చికిత్స అందిస్తున్నట్టు వైద్యులు తెలిపారు.

Tags:    

Similar News