23 మంది జర్నలిస్టులకు కొవిడ్ సాయం మంజూరు..

దిశ, ఖమ్మం : ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కరోనా బారిన పడ్డ జర్నలిస్టులకు రూ. 2.30 లక్షలు మంజూరు అయినట్లు టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఆకుతోట ఆదినారాయణ, సయ్యద్ ఇస్మాయిల్ తెలిపారు. ఖమ్మం జిల్లాలో 15 మంది, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 8 మందికి.. మొత్తం 23 మంది జర్నలిస్టులకు తలా పదివేల రూపాయల చొప్పున లబ్ధి చేకూరిందని పేర్కొన్నారు. కొవిడ్ బారిన పడ్డ జర్నలిస్టులకు మీడియా అకాడమీ ద్వారా తక్షణ ఆర్థిక సాయం […]

Update: 2021-08-07 03:52 GMT

దిశ, ఖమ్మం : ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కరోనా బారిన పడ్డ జర్నలిస్టులకు రూ. 2.30 లక్షలు మంజూరు అయినట్లు టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఆకుతోట ఆదినారాయణ, సయ్యద్ ఇస్మాయిల్ తెలిపారు. ఖమ్మం జిల్లాలో 15 మంది, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 8 మందికి.. మొత్తం 23 మంది జర్నలిస్టులకు తలా పదివేల రూపాయల చొప్పున లబ్ధి చేకూరిందని పేర్కొన్నారు.

కొవిడ్ బారిన పడ్డ జర్నలిస్టులకు మీడియా అకాడమీ ద్వారా తక్షణ ఆర్థిక సాయం అందజేయడంలో చొరవ చూపిన చైర్మన్ అల్లం నారాయణకు వారు కృతజ్ఞతలు తెలిపారు. మూడో దశ కేసులు పెరుగుతున్న కారణంగా జర్నలిస్టులు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదినారాయణ, సయ్యద్ ఇస్మాయిల్ సూచించారు.

 

Tags:    

Similar News