‘కరోనా సోకినా ఇంట్లోనే ఉండొచ్చు’
న్యూఢిల్లీ: కరోనా సోకినా హోం ఐసోలేషన్‌లోనే ఉండొచ్చని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. అయితే, తేలికపాటి లక్షణాలు కలిగి ఉండి, హోం ఐసోలేషన్‌కు ఇంట్లో తగినన్ని వసతులుంటేనే ఇందుకు అనుమతి ఉంటుంది. ఈ మేరకు ఆరోగ్యశాఖ హోం ఐసోలేషన్‌కు సంబంధించి నూతన మార్గదర్శకాలు విడుదల చేసింది. దాని ప్రకారం.. రోగిలో చాలా తక్కువ లక్షణాలు కలిగి ఉండాలి. హోం ఐసోలేషన్‌లో ఉండేందుకు సరైన వసతులు ఉండాలి. ఐసోలేషన్‌లో ఉన్న వ్యక్తి తప్పనిసరిగా ప్రభుత్వ నిఘా అధికారికి అందుబాటులో ఉండాలి. […]
న్యూఢిల్లీ: కరోనా సోకినా హోం ఐసోలేషన్‌లోనే ఉండొచ్చని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. అయితే, తేలికపాటి లక్షణాలు కలిగి ఉండి, హోం ఐసోలేషన్‌కు ఇంట్లో తగినన్ని వసతులుంటేనే ఇందుకు అనుమతి ఉంటుంది. ఈ మేరకు ఆరోగ్యశాఖ హోం ఐసోలేషన్‌కు సంబంధించి నూతన మార్గదర్శకాలు విడుదల చేసింది. దాని ప్రకారం.. రోగిలో చాలా తక్కువ లక్షణాలు కలిగి ఉండాలి. హోం ఐసోలేషన్‌లో ఉండేందుకు సరైన వసతులు ఉండాలి. ఐసోలేషన్‌లో ఉన్న వ్యక్తి తప్పనిసరిగా ప్రభుత్వ నిఘా అధికారికి అందుబాటులో ఉండాలి. ఆరోగ్య సేతు యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఈ మేరకు అగ్రిమెంట్‌పై సంతకం చేయాలి. అయితే, ఈ లక్షణాలు ఏమాత్రం ఎక్కువైనట్టు అనిపించినా వెంటనే ఆస్పత్రికి తరలిస్తారు.
Tags: home isolation, guidelines, coronavirus, mild symptoms of corona, union health ministry