బిజీ బిజీగా.. కొవిడ్-19 కంట్రోల్ రూం

దిశ, హైదరాబాద్: కరోనా వైరస్ (కొవిడ్-19) నివారణకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కంట్రోల్ రూంకు ప్రజలు అధిక సంఖ్యలో కాల్స్ చేసి వారి ఇబ్బందులను చెప్పుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ప్రజల ఇబ్బందులను ఫోన్ ద్వారా ఫిర్యాదు చేయడానికి వీటిని ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ప్రజలకు అవసరమైన ఆహారం, షెల్టర్, మెడికల్ తదితర సమస్యలను కంట్రోల్ రూం ద్వారా అధికారులకు చేరేలా ఫోన్ చేసి సమాచారం అందిస్తున్నారు. వీరి సమస్యలను సావధానంగా వింటున్న […]

Update: 2020-04-09 07:31 GMT

దిశ, హైదరాబాద్: కరోనా వైరస్ (కొవిడ్-19) నివారణకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కంట్రోల్ రూంకు ప్రజలు అధిక సంఖ్యలో కాల్స్ చేసి వారి ఇబ్బందులను చెప్పుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ప్రజల ఇబ్బందులను ఫోన్ ద్వారా ఫిర్యాదు చేయడానికి వీటిని ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ప్రజలకు అవసరమైన ఆహారం, షెల్టర్, మెడికల్ తదితర సమస్యలను కంట్రోల్ రూం ద్వారా అధికారులకు చేరేలా ఫోన్ చేసి సమాచారం అందిస్తున్నారు. వీరి సమస్యలను సావధానంగా వింటున్న కంట్రోల్ రూమ్ సిబ్బంది ఫోన్ ద్వారా ఫిర్యాదు చేస్తున్నవారి వివరాలను నోట్ చేసుకుని ఆ ప్రాంతంలోని తహసీల్దార్లకు సమాచారం చేరవేస్తున్నారు. దీంతో స్థానికంగా వారికి కావాల్సిన ఆహారం, షెల్టర్, మెడికల్ తదితర ఇతర సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నారు. ప్రజల నుంచి వచ్చే కాల్స్‌తో కంట్రోల్ రూమ్ సిబ్బంది బిజీ బిజీగా ఉంటున్నారు.

చాలా మంది వివిధ రకాల ఇబ్బందులకు గురవుతున్నవారు హైదరాబాద్ జిల్లా కంట్రోల్ రూంకే ఫోన్ చేసి తమ బాధను చెప్పుకుంటున్నారు. అయితే, హైదరాబాద్ జిల్లా కంట్రోల్ సిబ్బంది ఇతర జిల్లాల ప్రజలు ఫోన్ చేసినా చిరాకు పడకుండా, ఎంతో అప్యాయంగా మాట్లాడుతూ సమాధానం ఇస్తున్నారు. హైదరాబాద్ జిల్లాకు రోజూ దాదాపుగా 100 వరకూ వివిధ రకాల సమస్యలతో ఫోన్ కాల్స్ వస్తున్నాయి. వీటిలో అత్యధికంగా ఆహారం, నైట్ షెల్టర్, మెడికల్ సంబంధిత సమస్యలే వస్తున్నాయి. అయితే, హైదరాబాద్ జిల్లా కంట్రోల్ రూంకు వచ్చే ఫిర్యాదులలో సుమారు 30 శాతం కాల్స్ ఇతర జిల్లాల నుంచే వస్తున్నట్టు సిబ్బంది చెబుతున్నారు.

కంట్రోల్ రూమ్ నంబర్లు ఇవే..

రాష్ట్ర ప్రభుత్వం కంట్రోల్ రూం నెబర్లను ఆయా శాఖల వారీగా విభజించింది. అందులో భాగంగా సెక్రటేరియట్, జీహెచ్ఎంసీ, ఫుడ్, రేషన్, సివిల్ సప్లయ్, పోలీస్ హెల్ప్ లైన్, అకామడేషన్ అండ్ ఫుడ్‌తో పాటు ఆయా జిల్లాలకు కంట్రల్ రూంలలో హెల్ప్ లైన్ నెంబర్లను అధికారులు ఏర్పాటు చేశారు. వీటిలో
ఆయా హెల్ప్ లైన్ కేంద్రాలు – నంబర్లు ఇలా ఉన్నాయి.

సెక్రటేరియట్ : 040 – 2345 062, 2345, 0735

ఫుడ్ : 91541 70990, 91541 70991

రేషన్ : 99486 82495

సివిల్ సప్లయ్ : 040- 2344 7770

పోలీసు హెల్ప్ లైన్ : 90 10 20 36 26

వసతి అండ్ ఫుడ్ : 97023 85140, 97013 85138, 91779 97750

హైదరాబాద్ కలెక్టర్ : 040 – 2320 2813

జీహెచ్ఎంసీ కంట్రోల్ రూమ్

91546 86549, 91546 86552,

91546 86558, 91546 86557

ఈమెయిల్ – ghmc.covid19@gmail.com

రంగారెడ్డి కంట్రోల్ రూమ్ నెంబర్లు

040 – 2323 0811
040 – 2323 0813
040 – 2323 0814
91774 28736

టోల్ ఫ్రీ నెంబర్ – 1800-425-0817

ఈమెయిల్ : Collector_rr@telangana.gov.in

మేడ్చల్ కంట్రోల్ రూమ్ నెంబర్లు..

08418- 297820
94924 09781

ఈమెయిల్ : collector-mdl@telangana.gov.in

Tags: covid 19 control room, staff, very busy, attending calls, service

Tags:    

Similar News