కరోనాతో ప్రజల డబ్బు వాడకంలో మార్పులు!
దిశ, వెబ్‌డెస్క్: గతేడాది నుంచి కరోనా ప్రభావంతో అనేక మార్పులు వచ్చిన నేపథ్యంలో దేశంలోని ప్రజలు నగదు వాడకం తగ్గించినట్టు నిపుణులు తెలిపారు. కరోనా వల్ల ప్రజల కరెన్సీ వినియోగంలో చాలా మార్పు వచ్చిందని, ప్రజలు ఎక్కువ డబ్బు ఏటీఎంల నుంచి తీస్తున్నప్పటికీ చిన్న చిన్న పేమెంట్ల కోసం డిజిటల్ వ్యాలెట్లను వాడుతున్నారని నిపుణులు వెల్లడించారు. ఇటీవల కరోనా సెకెండ్ వేవ్ తీవ్రంగా ఉన్న కారణంతో ప్రజలు బయటకు వెళ్లిన సమయంలో ఒకేసారి ఎక్కువ నగదును విత్‌డ్రా […]
దిశ, వెబ్‌డెస్క్: గతేడాది నుంచి కరోనా ప్రభావంతో అనేక మార్పులు వచ్చిన నేపథ్యంలో దేశంలోని ప్రజలు నగదు వాడకం తగ్గించినట్టు నిపుణులు తెలిపారు. కరోనా వల్ల ప్రజల కరెన్సీ వినియోగంలో చాలా మార్పు వచ్చిందని, ప్రజలు ఎక్కువ డబ్బు ఏటీఎంల నుంచి తీస్తున్నప్పటికీ చిన్న చిన్న పేమెంట్ల కోసం డిజిటల్ వ్యాలెట్లను వాడుతున్నారని నిపుణులు వెల్లడించారు. ఇటీవల కరోనా సెకెండ్ వేవ్ తీవ్రంగా ఉన్న కారణంతో ప్రజలు బయటకు వెళ్లిన సమయంలో ఒకేసారి ఎక్కువ నగదును విత్‌డ్రా చేసుకుంటున్నారు. అత్యవసరంగా డబ్బు కావాల్సినప్పుడు దాన్ని ఉపయోగిస్తున్నారని, ఇతర చిన్నా చితక చెల్లింపులు, రోజువారీ కొనుగోళ్లకు యూపీఐ, పేటీఎం వంటి ఇతర డిజిటల్ చెల్లింపులకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని నిపుణులు వివరించారు.
ఇదివరకు ఏటీఎం నుంచి సగటున రూ. 2,000 నుంచి రూ. 3,000 వరకు డబ్బును విత్‌డ్రా చేసేవారు. ఇప్పుడు ఆ మొత్తం రూ. 3,000 నుంచి రూ. 4,000 వరకు పెరిగినట్టు తెలుస్తోంది. రూ. 1,000 లోపు చేయాల్సిన చెల్లింపులను డిజిటల్ వ్యాలెట్ల నుంచి చేస్తున్నట్టు ప్రముఖ కన్సల్టింగ్ సంస్థ అడాషె తెలిపింది. తక్షణ చెల్లింపుల సేవలైన ఐఎంపీఎస్ సగటు లావాదేవీల విలువ రూ. 9,000గా ఉందని, గతంలో ఇది రూ. 6,000 నుంచి రూ. 7,000 మధ్య ఉన్నట్టు అడాషె నివేదిక పేర్కొంది. కాగా, ఆర్‌బీఐ గణాంకాల ప్రకారం.. మే మొదటి వారం నాటికి చలామణిలో ఉన్న నగదు రూ. 29,39,997 కోట్లు కాగా, మార్చి చివరి వారంలో ఇది రూ. 28,58,640 కోట్లుగా నమోదైంది.