ఏపీ ప్రభుత్వంపై కోర్టు ధిక్కారణ పిటిషన్

దిశ, నారాయణపేట: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపైన కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలైంది. దక్షిణ తెలంగాణ ప్రాంతాన్ని ఎడారిగా మార్చే విధంగా కృష్ణ నది నుండి అక్రమంగా నీటిని తరలించాలని పోతిరెడ్డి పాడు ప్రాజెక్ట్ విస్తరణ పేరుతో ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా రాయలసీమ ఎత్తి పోతల పథకం చేపట్టిన్నందున, నారాయణపేట్ నియోజకవర్గం దామరగిద్ద మండలం బాపన్‌పల్లి మాజీ సర్పంచ్ గవినోళ్ళ శ్రీనివాస్ గతంలో జాతీయ హరిత ట్రైబ్యునల్‌లో కేసు వేశారు. దీంతో ఆ ప్రాజెక్ట్ చేపట్టరాదని కోర్టు ఆదేశాలు […]

Update: 2021-06-23 08:47 GMT

దిశ, నారాయణపేట: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపైన కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలైంది. దక్షిణ తెలంగాణ ప్రాంతాన్ని ఎడారిగా మార్చే విధంగా కృష్ణ నది నుండి అక్రమంగా నీటిని తరలించాలని పోతిరెడ్డి పాడు ప్రాజెక్ట్ విస్తరణ పేరుతో ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా రాయలసీమ ఎత్తి పోతల పథకం చేపట్టిన్నందున, నారాయణపేట్ నియోజకవర్గం దామరగిద్ద మండలం బాపన్‌పల్లి మాజీ సర్పంచ్ గవినోళ్ళ శ్రీనివాస్ గతంలో జాతీయ హరిత ట్రైబ్యునల్‌లో కేసు వేశారు. దీంతో ఆ ప్రాజెక్ట్ చేపట్టరాదని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయినా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోర్టు ఆదేశాలను ఉల్లంఘించి ప్రాజెక్ట్‌ని ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మిస్తున్నందున శ్రీనివాస్ తాజాగా బుధవారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పైన కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేసినట్లు తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓఏ నెంబర్ 71/2020 కేసు ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పైన కోర్టు ధిక్కరణ కేసు వేయడం జరిగిందని, కోర్టు వద్దన్నా కూడా అక్రమంగా ప్రాజెక్ట్ చేపట్టడం అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చట్టాలన్నా, న్యాయ స్థానాల తీర్పులన్నా గౌరవం లేదా అని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వ అనుమతి కూడా లేదన్నారు. కేంద్రం కూడా నిర్మాణాలు చేయవద్దని ఆదేశాలు జారీ చేసినా వినకుండా అక్రమంగా ప్రాజెక్ట్ కడుతున్నారన్నారు. ఇది బాధ్యత లేని ప్రభుత్వం చేసే పని అని, రాజ్యాంగాన్ని కూడా ఉల్లంఘించే పని అని కోర్టు దృష్టికి తీసుకెళ్లినట్లు గవినోళ్ళ శ్రీనివాస్ తెలిపారు.

Tags:    

Similar News