సంప్రదాయ దుస్తుల్లో దంపతుల స్కేటింగ్.. వీడియో వైరల్

దిశ, ఫీచర్స్: హర్యానాకు చెందిన జిమ్నాస్ట్ పరుల్ ఇటీవల చీరోచిత విన్యాసాలు (చీరకట్టులో ఫ్రంట్ ఫ్లిప్, బ్యాక్ ఫ్లిప్, కార్ట్ వీల్స్) చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇదే మాదిరి అమెరికాకు చెందిన ఓ కపుల్.. చీరకట్టులో ఉన్న ఓ మహిళ, ధోవతి ధరించిన పురుషుడు మంచుకొండల్లో స్కేటింగ్ చేసి హౌరా అనిపించారు. స్విట్జర్లాండ్ ఫ్యాషన్ బ్లాగర్ మినావాల మెహతా చీరకట్టుతో చేసిన ఫీట్‌ను చూసి ఇన్‌స్పైర్ అయ్యే తాము ఇలా చేశామని ఆ దంపతులు తెలిపారు. […]

Update: 2021-02-08 02:59 GMT

దిశ, ఫీచర్స్: హర్యానాకు చెందిన జిమ్నాస్ట్ పరుల్ ఇటీవల చీరోచిత విన్యాసాలు (చీరకట్టులో ఫ్రంట్ ఫ్లిప్, బ్యాక్ ఫ్లిప్, కార్ట్ వీల్స్) చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇదే మాదిరి అమెరికాకు చెందిన ఓ కపుల్.. చీరకట్టులో ఉన్న ఓ మహిళ, ధోవతి ధరించిన పురుషుడు మంచుకొండల్లో స్కేటింగ్ చేసి హౌరా అనిపించారు. స్విట్జర్లాండ్ ఫ్యాషన్ బ్లాగర్ మినావాల మెహతా చీరకట్టుతో చేసిన ఫీట్‌ను చూసి ఇన్‌స్పైర్ అయ్యే తాము ఇలా చేశామని ఆ దంపతులు తెలిపారు.

యూఎస్‌కు చెందిన దివ్య మాయ-మధు దంపతులు మిన్నెసోటలోని ఓ ఫేమస్ మంచు స్కేటింగ్ ప్రదేశంలో శారీ, ధోవతి ధరించి స్కేటింగ్ చేశారు. రొటీన్‌కు భిన్నంగా క్రేజీగా ఉండటంతో పాటు తమ రెగ్యులర్ లైఫ్ నుంచి డిస్ట్రాక్షన్ కోసం ఇలాంటి విన్యాసం చేసినట్లు ఇన్‌స్టా వేదికగా వెల్లడించింది దివ్య. కాగా తప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్న ఈ వీడియోపై నెటిజన్లు స్పందిస్తున్నారు. బ్రిలియంట్ అంటూ కొందరు కామెంట్ చేస్తుండగా.. మహిళలు సంప్రదాయ వస్త్రాలతో అడ్డంకులు అధిగమిస్తున్నారంటూ మరికొందరు అంటున్నారు.

Tags:    

Similar News