ప్రారంభమైన ఓట్ల లెక్కింపు
దిశ ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ స్థానిక సంస్థల శాసన మండలి సభ్యుల ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు సోమవారం ఉదయం ప్రారంభమైంది. ఇందూర్‌లోని ప్రభుత్వ పాలిటెక్నిక్ మైదానంలో బ్యాలెట్ ఓట్ల లెక్కింపును కొద్ధి క్షణాల క్రితం అధికారులు ప్రారంభించారు. రెండు రౌండ్లలో మొత్తం 823 ఓట్లను కౌంటింగ్ చేయనున్నారు. ఆరు టెబుళ్లను ఏర్పాటు చేసి ముందుగా ఓట్లను 50 చొప్పున కట్టలు కట్టి లెక్కింపు షురూ చేశారు. కరోనా కారణంగా ఇద్ధరు ఓటర్లు వినియోగించిన రెండు పోస్టల్ […]
దిశ ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ స్థానిక సంస్థల శాసన మండలి సభ్యుల ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు సోమవారం ఉదయం ప్రారంభమైంది. ఇందూర్‌లోని ప్రభుత్వ పాలిటెక్నిక్ మైదానంలో బ్యాలెట్ ఓట్ల లెక్కింపును కొద్ధి క్షణాల క్రితం అధికారులు ప్రారంభించారు. రెండు రౌండ్లలో మొత్తం 823 ఓట్లను కౌంటింగ్ చేయనున్నారు. ఆరు టెబుళ్లను ఏర్పాటు చేసి ముందుగా ఓట్లను 50 చొప్పున కట్టలు కట్టి లెక్కింపు షురూ చేశారు. కరోనా కారణంగా ఇద్ధరు ఓటర్లు వినియోగించిన రెండు పోస్టల్ బ్యాలెట్‌లను లెక్కించారు. పోలింగ్ కౌంటింగ్‌కు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. పార్టీకి 8 మంది చొప్పున ఏజెంట్లను అనుమతించారు. జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, పరిశీలకులు వీర బ్రహ్మయ్య కౌంటింగ్ సరళిని పరిశీలిస్తున్నారు.