ఒక్కచోట కూడా గెలవలేకపోయారు : జనసేనానికి ధర్మాన చురకలు

దిశ, ఏపీ బ్యూరో: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్‌తో పవన్ కల్యాణ్ పోల్చుకోవడం సరికాదన్నారు. శ్రీకాకుళం టౌన్‌లోని చేనేత బజార్ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం పవన్ పై విరుచుకుపడ్డారు. ‘పవన్ కల్యాణ్ పార్టీ పెట్టి రాష్ట్రం అంతా తిరిగి రెండు ప్రాంతాల్లో పోటీ చేశారు. పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయారు. పవన్ కల్యాణ్ రాజకీయాల్లో కంటే సినిమాల్లో మంచి నటుడు. […]

Update: 2021-08-27 04:27 GMT

దిశ, ఏపీ బ్యూరో: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్‌తో పవన్ కల్యాణ్ పోల్చుకోవడం సరికాదన్నారు. శ్రీకాకుళం టౌన్‌లోని చేనేత బజార్ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం పవన్ పై విరుచుకుపడ్డారు. ‘పవన్ కల్యాణ్ పార్టీ పెట్టి రాష్ట్రం అంతా తిరిగి రెండు ప్రాంతాల్లో పోటీ చేశారు.

పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయారు. పవన్ కల్యాణ్ రాజకీయాల్లో కంటే సినిమాల్లో మంచి నటుడు. రాజకీయాల గురించి పవన్ కళ్యాణ్ ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. జగన్మోహన్‌రెడ్డి‌తో మీరు పోల్చుకోకండి, ఆయనకు ఆయనే సాటి. జగన్మోహన్‌రెడ్డిని విమర్శించడం సరికాదంటూ’ హితవు పలికారు. మరోవైపు నారా లోకేష్ సైతం జగన్‌ను టార్గెట్ చేస్తూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని, అది సబబుగా లేదన్నారు. మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడటం నేర్చుకోవాలని డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, లోకేష్‌కు హితవు పలికారు.

Tags:    

Similar News