‘ఓనం కలెక్షన్’ ప్రచార చిత్రంపై మలయాళీల ఫైర్
దిశ, ఫీచర్స్ : కేరళలో మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న మలయాళీ కమ్యూనిటీ వంటకాలాన్ని స్వాగతిస్తూ ‘ఓనం’ పండుగ ఘనంగా జరుపుకుంటారు. ఓనం ఉత్సవాలు కేరళ సంప్రదాయాలను, సంస్కృతిని ప్రత్యేకమైన రీతిలో ప్రతిబింబిస్తాయి. పది రోజులపాటు జరిగే ఈ ఉత్సవాల్లో సాంప్రదాయ విందు లేదా ఓనం ‘సాధ్యా’ ఆస్వాదించకుండా వేడుకలు పూర్తి కావు. అయితే ‘కాటన్స్ జైపూర్’ అనే క్లాతింగ్ బ్రాండ్ ఓనం పండుగ మొదలైన సందర్భంగా పండుగ స్పెషల్ కలెక్షన్స్ ఇంట్రడ్యూస్ చేస్తూ ఆన్‌లైన్ వేదికగా […]
దిశ, ఫీచర్స్ : కేరళలో మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న మలయాళీ కమ్యూనిటీ వంటకాలాన్ని స్వాగతిస్తూ ‘ఓనం’ పండుగ ఘనంగా జరుపుకుంటారు. ఓనం ఉత్సవాలు కేరళ సంప్రదాయాలను, సంస్కృతిని ప్రత్యేకమైన రీతిలో ప్రతిబింబిస్తాయి. పది రోజులపాటు జరిగే ఈ ఉత్సవాల్లో సాంప్రదాయ విందు లేదా ఓనం ‘సాధ్యా’ ఆస్వాదించకుండా వేడుకలు పూర్తి కావు. అయితే ‘కాటన్స్ జైపూర్’ అనే క్లాతింగ్ బ్రాండ్ ఓనం పండుగ మొదలైన సందర్భంగా పండుగ స్పెషల్ కలెక్షన్స్ ఇంట్రడ్యూస్ చేస్తూ ఆన్‌లైన్ వేదికగా ఫొటోలు విడుదల చేసింది. అందులోని ఓ ఫొటోలో సాధ్యాకు సంబంధించిన ఫొటోలుండగా, సంప్రదాయ ఆహారంలో ‘ఇడ్లీ, దోశ’ కూడా చేర్చడంతో మలయాళీలు తీవ్రంగా కాటన్స్ జైపూర్‌ను విమర్శిస్తున్నారు.
మారుతున్న కాలానికి అనుగుణంగా ‘కాటన్స్ జైపూర్’ బ్రాండ్ పండుగ సంప్రదాయాల్లోనూ ఆధునికతను చూపించాలనుకోగా, ‘ఓనం కలెక్షన్’ ప్రచార చిత్రాల్లో మహిళలు తెల్లటి సల్వార్ సూట్ ధరించి, అరటి ఆకులో వడ్డించిన భోజనాన్ని ఆస్వాదిస్తున్నట్లు చూపించారు. చిత్రంలోని సాధ్యా ఆహారంలో దోస, ఇడ్లీ, సాంబార్‌లతో పాటు చట్నీలతో కూడిన మూడు స్టీల్ బౌల్స్‌లో అన్నం కూడా ఉంది. అయితే అది కేరళ వాసుల మనసు నొప్పించడంతో తీవ్ర విమర్శలు ఎదుర్కుంటోంది. దాంతో ఆ కంపెనీ దిగొచ్చి తమ అధికారిక ఇన్‌స్టా నుంచి ఫొటోలను తొలగించగా ఫేస్‌బుక్, వెబ్‌సైట్‌లో మాత్రం అలానే ఉంచింది. అయితే ఆ ఫొటోలను స్క్రీన్ షాట్ తీసుకున్న నెటిజన్లు వాటిని షేర్ చేయడంతో ఆన్‌లైన్‌లో పెద్ద చర్చకు దారితీసింది. సంప్రదాయాలకు సంబంధించిన ఫోటోషూట్ చేయడానికి ముందు సరైన పరిశోధన చేయాలని, చిన్న తప్పు జరిగిన అందరి మనోభావాలు దెబ్బతింటాయని సూచిస్తున్నారు. అయితే కొందరు మాత్రం బ్రాండ్‌ను సమర్థిస్తూ, అరటి ఆకుపై తినే ప్రతి భోజనం పండుగకు అంకితం చేసింది కాదని, దాన్ని ‘సాధ్యా’గా భావించాల్సిన అవసరం లేదని వాదించారు.
మలయాళీయులకి ఓనం పండుగ అంటే ఎంతో ప్రత్యేకం. ఓనమ్ వచ్చిందంటే కేరళ సంబరాలు అంబరాన్నంటుతాయి. చరిత్ర ప్రకారం బలిచక్రవర్తి పాలించిన కాలం కేరళకు స్వర్ణయుగం. మహాబలి చేసిన మంచి పనులకు మెచ్చి, కేరళ ప్రజలను కలుసుకునేలా విష్ణుమూర్తి అతనికి వరమిచ్చాడని చరిత్రకారులు చెబుతారు. మహాబలి చక్రవర్తి ఏటా తన ప్రజలను కలుసుకునేందుకు ఆత్మరూపంలో కేరళ వస్తాడని ప్రజలు విశ్వాసిస్తారు. అందుకే అతడిని తమ ఇళ్లలోకి ఆహ్వానించేందుకు ఈ పండుగ జరుపుకుంటారు. ఆతం పేరుతో తొలిరోజు ప్రారంభమయ్యే ఉత్సవాలు పదో రోజున తిరుఓనంతో ఘనంగా ముగుస్తాయి. ఇక అరటాకులో సుమారు 26 రకాల వంటకాలతో వాళ్లు చేసే సాధ్యా ఓనమ్‌కు స్పెషల్‌గా నిలుస్తుంది. ఒప్పెరి, శాఖార వారట్టి, పప్పడం, మ్యాంగో కర్రీ, నరంగ కర్రీ, ఎల్లిషెరి, పులిస్సెరి, కాలన్, ఓలన్, పచ్చడి, ఇంజీ కర్రీ ఇలా మొత్తంగా 26 కేరళ సంప్రదాయ వంటకాలను అరిటాకులో పెట్టుకుని భోజనం చేస్తారు.