అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన కార్పొరేటర్లు..

దిశ, మేడిపల్లి: బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 4, 5వ డివిజన్ ఎన్ ఐ ఎన్ కాలనీలో రూ. 24 లక్షల నిధులతో సిసి రోడ్డు పనులకు మేయర్ సామల బుచ్చిరెడ్డి, డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మి రవి గౌడ్  స్థానిక కార్పొరేటర్లు కొత్త స్రవంతి కిషోర్ గౌడ్, సింగిరెడ్డి పద్మా రెడ్డి తో కలిసి అభివృద్ధి పనులను ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. కాలనీ వాసులకు గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం పూర్తిస్థాయిలో సిసి […]

Update: 2021-12-21 07:30 GMT

దిశ, మేడిపల్లి: బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 4, 5వ డివిజన్ ఎన్ ఐ ఎన్ కాలనీలో రూ. 24 లక్షల నిధులతో సిసి రోడ్డు పనులకు మేయర్ సామల బుచ్చిరెడ్డి, డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మి రవి గౌడ్ స్థానిక కార్పొరేటర్లు కొత్త స్రవంతి కిషోర్ గౌడ్, సింగిరెడ్డి పద్మా రెడ్డి తో కలిసి అభివృద్ధి పనులను ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. కాలనీ వాసులకు గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం పూర్తిస్థాయిలో సిసి రోడ్లు, డ్రైనేజీ పనులను పూర్తి చేశామని అన్నారు.

త్వరలోనే తాగునీటి సమస్య, బస్‌స్టాప్, అంగన్ వాడి కేంద్రం, రేషన్ డీలర్ షాప్,సీ నియర్ సిటిజన్స్ కోసం గ్రంథాలయం, తదితర వసతులు కల్పిస్తామని ప్రణాళికా బద్ధంగా చర్యలు చేపట్టి అభివృద్ధి లో ముందుకు సాగుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ బి. శ్రీనివాస్, మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ బి-బ్లాక్ ప్రధాన కార్యదర్శి కొత్త కిషోర్ గౌడ్, యూత్ కాంగ్రెస్ నాయకులు ఆసర్ల బీరప్ప, ప్రశాంత్, శ్రీనివాస్ గౌడ్, సింగిరెడ్డి రాజు రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, నాగరాజు, బాలరాజు, స్థానిక నాయకులు, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News