కోతుల్లో వైరస్‌ను నిరోధించిన రెమెడిసివిర్
దిశ, వెబ్‌డెస్క్: కరోనా వైరస్ విజృంభణ ఏమాత్రం తగ్గడం లేదు. రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. వైరస్‌ను కట్టడి చేసేందుకు చాలా దేశాలు వ్యాక్సిన్ కోసం పరిశోధనలు చేస్తుండగా శాస్ర్తవేత్తలకు సవాల్‌గా మారింది. ఈ నేపథ్యంలో కొవిడ్-19 చికిత్సలో యాంటీవైరల్ ఔషధం ‘రెమెడిసివిర్’ కాస్త మెరుగైన ఫలితాలను కనబరుస్తుండటం సానుకూలాంశం. మరోవైపు.. కరోనా బాధితులకు ఉపశమనం కలిగిస్తున్న రెమెడిసివిర్‌కు అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ(యూఎస్‌ఎఫ్‌డీఏ) ఇప్పటికే ఎమర్జెన్సీ యూజ్ ఆథరైజేషన్ ఇచ్చింది. భారత ప్రభుత్వం […]
దిశ, వెబ్‌డెస్క్:
కరోనా వైరస్ విజృంభణ ఏమాత్రం తగ్గడం లేదు. రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. వైరస్‌ను కట్టడి చేసేందుకు చాలా దేశాలు వ్యాక్సిన్ కోసం పరిశోధనలు చేస్తుండగా శాస్ర్తవేత్తలకు సవాల్‌గా మారింది. ఈ నేపథ్యంలో కొవిడ్-19 చికిత్సలో యాంటీవైరల్ ఔషధం ‘రెమెడిసివిర్’ కాస్త మెరుగైన ఫలితాలను కనబరుస్తుండటం సానుకూలాంశం. మరోవైపు.. కరోనా బాధితులకు ఉపశమనం కలిగిస్తున్న రెమెడిసివిర్‌కు అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ(యూఎస్‌ఎఫ్‌డీఏ) ఇప్పటికే ఎమర్జెన్సీ యూజ్ ఆథరైజేషన్ ఇచ్చింది. భారత ప్రభుత్వం ఇందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ‘ఎమర్జెన్సీ సమయాల్లో ఈ ఔషధాన్ని వినియోగించేందుకు జూన్ 1న అనుమతులిచ్చాం. అయితే ఐదు డోసులు మాత్రమే ఇవ్వాలి’ అని డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా’ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ మందు మొదటి క్లినికల్ ట్రయల్స్‌లోనే కొవిడ్ పేషెంట్లపై మెరుగైన ప్రభావం చూపించింది. ఇప్పుడు కోతులపై జరిపిన ప్రయోగాల్లోనూ పాజిటివ్ ఫలితాలను చూపించిందని ‘జర్నల్ నేచర్’లో పబ్లిష్ అయ్యింది.
కరోనా వైరస్‌పై రెమెడిసివిర్ పనితీరు ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి పరిశోధకులు 12 కోతులకు కరోనా ఇంజెక్ట్ చేశారు. వాటిని రెండు గ్రూపులుగా విడదీసి, మొదటి ఆరు కోతులపై ఈ డ్రగ్‌ను ప్రయోగించారు. రెమెడిసివిర్ మందు ఇచ్చిన 12 గంటల తర్వాత నుంచి వాటిని ఆబ్జర్వ్ చేయడంతోపాటు ప్రతి 24 గంటలకు ట్రీట్‌మెంట్ ఇచ్చారు. ఇలా ఆరు రోజులపాటు వాటిపై పరిశోధనలు సాగాయి. మూడు రోజుల తర్వాతి నుంచి వాటి ఊపిరితిత్తుల డ్యామేజ్ తగ్గడంతోపాటు శ్వాసకోస సంబంధ వ్యాధులేవీ కూడా వాటిలో కనిపించలేదని పరిశోధనల్లో తేలింది. వైరస్ వ్యాప్తి కూడా తగ్గిందని వైద్యులు వెల్లడించారు.