ప్రధాని భార్యకూ కరోనా
ఒట్టావా: ప్రపంచవ్యాప్తంగా అత్యంత వేగంగా ప్రబలుతున్న కరోనా వైరస్ (కోవిడ్-19) బారిన సామాన్యులే కాకుండా ప్రముఖులూ పడుతున్నారు. ఇటీవలే బ్రిటన్ ఆరోగ్యమంత్రికి సోకిన ఈ మహమ్మారి.. తాజాగా, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో భార్య సోఫీ గ్రెగోర్ కు సైతం సోకింది. ఓ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం గ్రెగోర్‌కు ఈ వైరస్ లక్షణాలు కనిపించాయి. దీంతో వైద్య పరీక్షలు జరపగా, రిపోర్టుల్లో కరోనా పాజిటివ్‌గా వచ్చినట్టు ఓ అంతర్జాతీయ మీడియా సంస్థ వెల్లడించింది. దీంతో గ్రెగోర్‌ను ప్రత్యేకవార్డులో […]
ఒట్టావా: ప్రపంచవ్యాప్తంగా అత్యంత వేగంగా ప్రబలుతున్న కరోనా వైరస్ (కోవిడ్-19) బారిన సామాన్యులే కాకుండా ప్రముఖులూ పడుతున్నారు. ఇటీవలే బ్రిటన్ ఆరోగ్యమంత్రికి సోకిన ఈ మహమ్మారి.. తాజాగా, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో భార్య సోఫీ గ్రెగోర్ కు సైతం సోకింది. ఓ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం గ్రెగోర్‌కు ఈ వైరస్ లక్షణాలు కనిపించాయి. దీంతో వైద్య పరీక్షలు జరపగా, రిపోర్టుల్లో కరోనా పాజిటివ్‌గా వచ్చినట్టు ఓ అంతర్జాతీయ మీడియా సంస్థ వెల్లడించింది. దీంతో గ్రెగోర్‌ను ప్రత్యేకవార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. కాగా, ప్రధాని ట్రూడోకు ఇప్పటివరకు ఈ వ్యాధి లక్షణాలు కనిపించనప్పటికీ, అధికార కార్యక్రమాలన్నీ ఇంటి నుంచే నిర్వహిస్తున్నారు. ఏకంగా దేశప్రధాని భార్యకే ఈ వైరస్ సోకడం కెనడా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
tags: canada, pm wife, justin trudeau, Sophie Grégoire, carona, virus, carona to canada pm