ఆయుష్మాన్ భారత్‌లోకి కరోనా ట్రీట్‌మెంట్
కరోనా వైరస్ పరీక్షలు, చికిత్సను కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య బీమా పథకం ఆయుష్మాన్ భారత్ పరిధిలోకి తీసుకువచ్చే అవకాశం ఉన్నట్లు మంగళవారం అధికార వర్గాలు తెలిపాయి. జాతీయ ఆరోగ్య సంస్థ ఇప్పటికే ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజన (ఆయుష్మాన్ భారత్) పరిధిలోకి కరోనా చికిత్సను తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రభుత్వ అనుమతిని కోరింది. కేంద్రం అనుమతి వస్తే వెంటనే ఉత్తర్వులు జారీ చేస్తామని, అప్పుడు ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఎలాంటి ఖర్చు లేకుండా బాధితులకు కరోనా పరీక్షలు, చికిత్సలు […]
కరోనా వైరస్ పరీక్షలు, చికిత్సను కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య బీమా పథకం ఆయుష్మాన్ భారత్ పరిధిలోకి తీసుకువచ్చే అవకాశం ఉన్నట్లు మంగళవారం అధికార వర్గాలు తెలిపాయి. జాతీయ ఆరోగ్య సంస్థ ఇప్పటికే ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజన (ఆయుష్మాన్ భారత్) పరిధిలోకి కరోనా చికిత్సను తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రభుత్వ అనుమతిని కోరింది. కేంద్రం అనుమతి వస్తే వెంటనే ఉత్తర్వులు జారీ చేస్తామని, అప్పుడు ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఎలాంటి ఖర్చు లేకుండా బాధితులకు కరోనా పరీక్షలు, చికిత్సలు అదుబాటులోకి వస్తాయని అధికారులు తెలిపారు. ఆయుష్మాన్ భారత్ కింది గుర్తించిన వ్యాధులకు రూ. 5 లక్షల వరకు ఎలాంటి ఖర్చు లేకుండా చికిత్స పొందవచ్చు. ఈ పథకం కింద 2011 జనాభా లెక్కల ప్రకారం 10.74 కోట్ల కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయి.
Tags: coronavirus test,under ayushman bharat scheme report, corona lockdown