భారత్‌లో కరోనా విజృంభణ
దేశంలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఈ మహమ్మారి బారినపడి దేశంలో ఇప్పటివరకూ ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, వైరస్ సోకిన వారి సంఖ్య 137కు చేరింది. దీని విజృంభణతో మహారాష్ట్రలో అధికంగా 39కేసులు నమోదవ్వగా, కేరళలో 26, ఉత్తరప్రదేశ్‌లో 15, హర్యానాలో 15, కర్నాటకలో 11, ఢిల్లీలో 8, లడఖ్‌లో 6, తెలంగాణలో 5, రాజస్థాన్‌లో 4, జమ్ముకశ్మీర్‌లో 3, ఉత్తరాఖండ్, పంజాబ్, ఒడిశా, ఏపీ, తమిళనాడులో ఒక్కో కేసు నమోదైంది. ఈ వైరస్ వ్యాప్తిని […]
దేశంలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఈ మహమ్మారి బారినపడి దేశంలో ఇప్పటివరకూ ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, వైరస్ సోకిన వారి సంఖ్య 137కు చేరింది. దీని విజృంభణతో మహారాష్ట్రలో అధికంగా 39కేసులు నమోదవ్వగా, కేరళలో 26, ఉత్తరప్రదేశ్‌లో 15, హర్యానాలో 15, కర్నాటకలో 11, ఢిల్లీలో 8, లడఖ్‌లో 6, తెలంగాణలో 5, రాజస్థాన్‌లో 4, జమ్ముకశ్మీర్‌లో 3, ఉత్తరాఖండ్, పంజాబ్, ఒడిశా, ఏపీ, తమిళనాడులో ఒక్కో కేసు నమోదైంది. ఈ వైరస్ వ్యాప్తిని నివారించేందుకు ఇప్పటికే హైఅలెర్ట్ ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం.. కరోనా బాధితుల కోసం తాజాగా, కొత్త హెల్ప్‌లైన్ నెంబర్ (011-24300666)ను ప్రకటించింది. అలాగే, కరోనా పరీక్షలు చేయడానికి దేశవ్యాప్తంగా 72ల్యాబ్‌లను అందుబాటులోకి తీసుకొచ్చినట్టు వెల్లడించింది.
Tags: coronavirus, india, toll free number, labs, positive cases