కరోనా కేసులు మరింత పైపైకి
న్యూఢిల్లీ: కరోనా వైరస్ సెకండ్ వేవ్ ఉధృతి అంతకంతకు పెరుగుతూ వస్తున్నది. ఒక్క రోజుల లక్ష కేసులను దాటడమే కాదు.. తాజాగా 1.26 లక్షల కేసులు కొత్తగా నమోదయ్యాయి. కరోనా మనదేశంలోకి ప్రవేశించినప్పటి నుంచి ఇవే అత్యధిక కేసులు. ఫలితంగా మొత్తం కేసులు 1,29,28,574కు చేరాయి. ప్రపంచంలో అమెరికా, బ్రెజిల్ తర్వాత అత్యధిక కేసుల జాబితాలో మన దేశం మూడో స్థానంలో నిలిచింది. యాక్టివ్ కేసులు మళ్లీ తొమ్మిది లక్షలను దాటాయి. దేశంలో ప్రస్తుతం 9,10,319 క్రియాశీలక […]
న్యూఢిల్లీ: కరోనా వైరస్ సెకండ్ వేవ్ ఉధృతి అంతకంతకు పెరుగుతూ వస్తున్నది. ఒక్క రోజుల లక్ష కేసులను దాటడమే కాదు.. తాజాగా 1.26 లక్షల కేసులు కొత్తగా నమోదయ్యాయి. కరోనా మనదేశంలోకి ప్రవేశించినప్పటి నుంచి ఇవే అత్యధిక కేసులు. ఫలితంగా మొత్తం కేసులు 1,29,28,574కు చేరాయి. ప్రపంచంలో అమెరికా, బ్రెజిల్ తర్వాత అత్యధిక కేసుల జాబితాలో మన దేశం మూడో స్థానంలో నిలిచింది. యాక్టివ్ కేసులు మళ్లీ తొమ్మిది లక్షలను దాటాయి. దేశంలో ప్రస్తుతం 9,10,319 క్రియాశీలక కేసులున్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ గురువారం ఉదయం వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో 685 మంది కరోనాతో మరణించారని తెలిపింది. మొత్తం మరణాల సంఖ్య 1,66,862కు చేరింది.