పశ్చిమగోదావరి జిల్లాను కుదిపేసిన కరోనా

ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లాను కరోనా కలకలం పట్టికుదిపేసింది. ఢిల్లీలోని నిజాముద్దీన్ దగ్గర్లోని తబ్లిగ్ జమాత్ మర్కజ్‌లో పాల్గొన్నవారికి కరోనా సోకింది. నిన్న ఒక్కరోజే జిల్లాలో 30 మందికి వైద్యపరీక్షలు నిర్వహించగా వారిలో 14 మందికి కరోనా పాజిటివ్, మరో పది మందికి నెగిటివ్, ఇంకో ఆరుగురి నివేదికలు రావాల్సి ఉంది. పశ్చిమగోదావరి జిల్లాలో ఇప్పటి వరకు ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదు. దీంతో ఆ జిల్లా సేఫ్‌గా ఉందని వైద్యఆరోగ్య శాఖ కూడా భావించింది. […]

Update: 2020-04-01 01:02 GMT

ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లాను కరోనా కలకలం పట్టికుదిపేసింది. ఢిల్లీలోని నిజాముద్దీన్ దగ్గర్లోని తబ్లిగ్ జమాత్ మర్కజ్‌లో పాల్గొన్నవారికి కరోనా సోకింది. నిన్న ఒక్కరోజే జిల్లాలో 30 మందికి వైద్యపరీక్షలు నిర్వహించగా వారిలో 14 మందికి కరోనా పాజిటివ్, మరో పది మందికి నెగిటివ్, ఇంకో ఆరుగురి నివేదికలు రావాల్సి ఉంది.

పశ్చిమగోదావరి జిల్లాలో ఇప్పటి వరకు ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదు. దీంతో ఆ జిల్లా సేఫ్‌గా ఉందని వైద్యఆరోగ్య శాఖ కూడా భావించింది. జిల్లాల వారీగా కరోనా కేసులు వెల్లడించినప్పుడు కూడా దీనినే ప్రముఖంగా పేర్కొంది. అయితే కరోనా లేదన్న 24 గంటలలోపే ఆ జిల్లా కరోనా కేసుల్లో టాప్‌లో నిలిచింది. ఏలూరులో ఆరుగురికి, భీమవరంలో ఇద్దరికి, ఆకివీడు, ఉండి, నారాయణపురం, గుండుగొలనుల్లో ఒక్కొక్కరికి కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం జిల్లాలో కలకలం రేగింది.

నిన్నమొన్నటి వరకు తమతో కలిసి తిరిగిన వారికి కరోనా ఉందని తేలడంతో వారి సన్నిహితుల్లో ఆందోళన నెలకొంది. ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కారణంగా ఆసుపత్రుల్లో చేరుతున్నవారికి ఢిల్లీ వెళ్లిన వారికి ఏదో ఒక సంబంధం బయటపడుతోంది. దీంతో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని ఢిల్లీ వెళ్లిన వారిని స్వచ్ఛందంగా వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. అయినప్పటికీ చాలా మంది ముందుకు రావడం లేదని తెలుస్తోంది. దీంతో ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్‌లో 58 కరోనా కేసులు నమోదయ్యాయి.

Tags : CORONA, covid-19, west godavari, 14 cases

Tags:    

Similar News