ఆ డాక్టర్ ను కలిసిన 900 మంది క్వారంటైన్ లోకి…
న్యూఢిల్లీ : కరోనా ఆపత్కాలంలో వైద్యులు రేయింబవళ్ళు కష్టపడి బాధితులకు చికిత్సనందిస్తున్నారు. అసామాన్యమైన సేవలందిస్తున్నారు. అందుకే ప్రజలు వారిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. కేవలం ప్రశంసల కే పరిమితమైతే సరిపోదు, వైద్యులను కాపాడుకోవాల్సిన బాధ్యతా మన మీద ఉన్నది. ఎందుకంటే వైద్యులకు కరోనా సోకితే, రోజూ టెస్టులు, చికిత్స పొందుతున్న వందల మందికి వైరస్ విస్తరించే ప్రమాదమున్నది. ఢిల్లీలో అటువంటి ఉదంతమే చోటు చేసుకుంది. ఈశాన్య ఢిల్లీ మౌజ్ పూర్ లోని మొహాల్ల క్లినిక్ లో సేవలందిస్తున్న ఓ […]
న్యూఢిల్లీ : కరోనా ఆపత్కాలంలో వైద్యులు రేయింబవళ్ళు కష్టపడి బాధితులకు చికిత్సనందిస్తున్నారు. అసామాన్యమైన సేవలందిస్తున్నారు. అందుకే ప్రజలు వారిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. కేవలం ప్రశంసల కే పరిమితమైతే సరిపోదు, వైద్యులను కాపాడుకోవాల్సిన బాధ్యతా మన మీద ఉన్నది. ఎందుకంటే వైద్యులకు కరోనా సోకితే, రోజూ టెస్టులు, చికిత్స పొందుతున్న వందల మందికి వైరస్ విస్తరించే ప్రమాదమున్నది. ఢిల్లీలో అటువంటి ఉదంతమే చోటు చేసుకుంది.
ఈశాన్య ఢిల్లీ మౌజ్ పూర్ లోని మొహాల్ల క్లినిక్ లో సేవలందిస్తున్న ఓ వైద్యుడికి కరోనా సోకింది. దీంతో ఈ నెల 12 నుంచి 18 వరకు అతని వద్ద చికిత్స పొందిన సుమారు 900 మందిని క్వారంటైన్ లోకి పంపినట్టు ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్ వెల్లడించారు. సౌదీ అరేబియా నుంచి వచ్చిన ఓ మహిళ నుండి ఆ వైద్యుడి భార్య, కూతురు, మరొకరికి ఈ వైరస్ అంటుకున్నట్టు తెలిపారు. ఇప్పటివరకు ఢిల్లీలో 36 కరోనా కేసులు నమోదైనట్టు తెలిపారు.
Tags: Coronavirus, 800 people, quarantine, delhi, infected, doctor