ప్రమాదకర దశలోకి మహమ్మారి: డబ్ల్యూహెచ్ఓ

జెనీవా: కరోనా వైరస్ మరో ప్రమాదకర దశలోకి వెళ్తున్నదని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) ప్రపంచదేశాలను హెచ్చరించింది. ప్రపంచదేశాలు కరోనా కట్టడికోసం లాక్‌డౌన్ విధించాయని, కొన్ని విజయవంతంగా కరోనా వ్యాప్తిని దాదాపుగా అడ్డుకోగలిగాయని డబ్ల్యూహెచ్ఓ చీఫ్ టెడ్రోస్ అథనామ్ గేబ్రియస్ తెలిపారు. మరికొన్ని దేశాలు ఆర్థిక వ్యవస్థను దృష్టిలో పెట్టుకుని లాక్‌డౌన్‌ను ఎత్తేస్తున్నాయని, ప్రజలూ ఐసొలేషన్‌పై మొహం మొత్తి ఉన్నారని చెప్పారు. ప్రజలు లాక్‌డౌన్ అంటే విరక్తి చెంది ఉన్నారేమో కానీ, వైరస్ మాత్రం తన వేగాన్ని తగ్గించుకోలేదని […]

Update: 2020-06-20 07:36 GMT

జెనీవా: కరోనా వైరస్ మరో ప్రమాదకర దశలోకి వెళ్తున్నదని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) ప్రపంచదేశాలను హెచ్చరించింది. ప్రపంచదేశాలు కరోనా కట్టడికోసం లాక్‌డౌన్ విధించాయని, కొన్ని విజయవంతంగా కరోనా వ్యాప్తిని దాదాపుగా అడ్డుకోగలిగాయని డబ్ల్యూహెచ్ఓ చీఫ్ టెడ్రోస్ అథనామ్ గేబ్రియస్ తెలిపారు. మరికొన్ని దేశాలు ఆర్థిక వ్యవస్థను దృష్టిలో పెట్టుకుని లాక్‌డౌన్‌ను ఎత్తేస్తున్నాయని, ప్రజలూ ఐసొలేషన్‌పై మొహం మొత్తి ఉన్నారని చెప్పారు. ప్రజలు లాక్‌డౌన్ అంటే విరక్తి చెంది ఉన్నారేమో కానీ, వైరస్ మాత్రం తన వేగాన్ని తగ్గించుకోలేదని వివరించారు. మహమ్మారి మరింత వేగంగా విస్తరిస్తూ సరికొత్త ప్రమాదకర దశను ప్రపంచానికి సవాల్ విసురుతున్నదని పేర్కొన్నారు. గురువారం ఒక్క రోజే ప్రపంచవ్యాప్తంగా 1.50లక్షల కేసులు వెలుగుచూశాయని చెప్పారు. ఇందులో చాలావరకు అమెరికా దేశాలు, దక్షిణాసియా, మిడిల్ ఈస్ట్ దేశాల్లో అధికంగా కేసులు నమోదవుతున్నాయని వివరించారు.

Tags:    

Similar News