భారత్‌లో 1,000 దాటిన కరోనా మరణాలు
న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. ఓ వైపు పాజిటివ్ కేసులు, మరోవైపు మృతుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 73 మరణాలు సంభవించగా, అదే రీతిలో 1,897 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశవ్యాప్తంగా కరోనా బారినపడి మరణించినవారి సంఖ్య 1,007కు చేరగా, వైరస్ సోకినవారి సంఖ్య 31,332కు పెరిగిందని కేంద్ర ఆరోగ్యశాఖ బుధవారం వెల్లడించింది. ఒక్క మహారాష్ట్రలోనే 24గంటల వ్యవధిలో కొత్తగా 729 పాజిటివ్ కేసులు వెలుగు చూడగా, […]
న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. ఓ వైపు పాజిటివ్ కేసులు, మరోవైపు మృతుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 73 మరణాలు సంభవించగా, అదే రీతిలో 1,897 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశవ్యాప్తంగా కరోనా బారినపడి మరణించినవారి సంఖ్య 1,007కు చేరగా, వైరస్ సోకినవారి సంఖ్య 31,332కు పెరిగిందని కేంద్ర ఆరోగ్యశాఖ బుధవారం వెల్లడించింది.
ఒక్క మహారాష్ట్రలోనే 24గంటల వ్యవధిలో కొత్తగా 729 పాజిటివ్ కేసులు వెలుగు చూడగా, 31మంది మృతిచెందారు. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 9,318కి చేరగా, మృతుల సంఖ్య 400కు పెరిగింది. గుజరాత్‌లోనూ వైరస్ తీవ్రత ఆందోళనకర స్థాయిలో ఉంది. ఈ రాష్ట్రంలో కేసుల సంఖ్య 3,744కు చేరగా, 181మంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే, దేశ రాజధాని ఢిల్లీలో 3,314 మంది కరోనా బారినపడగా, 54మంది మృతిచెందారు. మధ్యప్రదేశ్‌లో కేసుల సంఖ్య 2,387కు చేరగా, 120మంది చనిపోయారని ఆరోగ్యశాఖ వివరించింది. ఇదిలా ఉండగా, దేశవ్యాప్తంగా ప్రస్తుతం 22,629 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతుండగా, 7,696మంది వైరస్ బారినపడి కోలుకున్నారు. కాగా, ఈ మహమ్మారి నుంచి కోలుకుంటున్న వారి శాతం బుధవారం ఉదయం నాటికి 24.56గా ఉందని వెల్లడించింది.
Tags: corona virus in india, corona deaths in india, corona in india, covid 19, india, corona, union home ministry, maharashtra, gujarat