ఒక్క రోజులో 81,466 కేసులు – 469 కరోనా మరణాలు

న్యూఢిల్లీ: దేశంలో కరోనా విశ్వరూపాన్ని ప్రదర్శిస్తున్నది. ఒక్క రోజులోనే 81,466 కొత్త కేసులు నమోదయ్యాయి. గడిచిన ఆరు నెలల్లో ఇవే అత్యధికం. గడిచిన 24 గంటల్లో 81,466 కేసులు కొత్తగా నమోదైనట్టు కేంద్ర ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించింది. 469 కరోనా మరణాలు చోటుచేసుకున్నట్టు తెలిపింది. ఇందులో కేవలం మహారాష్ట్రలోనే 43,183 కేసులున్నాయి. ఛత్తీస్‌గడ్, కర్ణాటకలూ 4,000కు మించి కేసులను రిపోర్ట్ చేశాయి. శుక్రవారం ఉదయానికి దేశంలో మొత్తం కేసుల సంఖ్య 12,302,110కు చేరాయి. […]

Update: 2021-04-01 23:09 GMT
ఒక్క రోజులో 81,466 కేసులు – 469 కరోనా మరణాలు
  • whatsapp icon

న్యూఢిల్లీ: దేశంలో కరోనా విశ్వరూపాన్ని ప్రదర్శిస్తున్నది. ఒక్క రోజులోనే 81,466 కొత్త కేసులు నమోదయ్యాయి. గడిచిన ఆరు నెలల్లో ఇవే అత్యధికం. గడిచిన 24 గంటల్లో 81,466 కేసులు కొత్తగా నమోదైనట్టు కేంద్ర ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించింది. 469 కరోనా మరణాలు చోటుచేసుకున్నట్టు తెలిపింది. ఇందులో కేవలం మహారాష్ట్రలోనే 43,183 కేసులున్నాయి. ఛత్తీస్‌గడ్, కర్ణాటకలూ 4,000కు మించి కేసులను రిపోర్ట్ చేశాయి. శుక్రవారం ఉదయానికి దేశంలో మొత్తం కేసుల సంఖ్య 12,302,110కు చేరాయి. మొత్తం మరణాలు 1.63 లక్షలను దాటాయి. కొత్త కేసుల పెరుగుదలతో దేశంలో యాక్టివ్‌గా ఉన్న కేసుల సంఖ్య 6,14,696గా ఉన్నది.

Tags:    

Similar News