ధారావిలో 101 కేసులు
ముంబయి : ఆసియాలోనే అతిపెద్ద స్లమ్.. ముంబయిలోని ధారావిలో కరోనా కేసుల సంఖ్య వందను దాటింది. శుక్రవారం కొత్తగా 15 కేసులు వెలుగచూడటంతో ఈ మురికివాడలో కేసుల సంఖ్య 101కి పెరిగింది. కాగా, ఈ ఏరియా నుంచి ఇప్పటి వరకు 10 మంది చనిపోయారు. శుక్రవారం సిటీ హాస్పిటల్‌లో ఓ కొవిడ్ 19 పేషెంట్ ప్రాణాలు కోల్పోయినట్టు మున్సిపల్ అధికారి ఒకరు వెల్లడించారు. కాగా, శుక్రవారం నమోదైన 15 కేసుల్లో మాతుంగ లేబర్ క్యాంప్, ముస్లిం నగర్, […]
ముంబయి : ఆసియాలోనే అతిపెద్ద స్లమ్.. ముంబయిలోని ధారావిలో కరోనా కేసుల సంఖ్య వందను దాటింది. శుక్రవారం కొత్తగా 15 కేసులు వెలుగచూడటంతో ఈ మురికివాడలో కేసుల సంఖ్య 101కి పెరిగింది. కాగా, ఈ ఏరియా నుంచి ఇప్పటి వరకు 10 మంది చనిపోయారు. శుక్రవారం సిటీ హాస్పిటల్‌లో ఓ కొవిడ్ 19 పేషెంట్ ప్రాణాలు కోల్పోయినట్టు మున్సిపల్ అధికారి ఒకరు వెల్లడించారు. కాగా, శుక్రవారం నమోదైన 15 కేసుల్లో మాతుంగ లేబర్ క్యాంప్, ముస్లిం నగర్, ఇందిరా నగర్‌లలో మూడు కేసుల చొప్పున రిపోర్ట్ అయ్యాయి. ఇరుకు ఇరుకుగా సుమారు ఎనిమిది లక్షల మంది నివసించే ఈ ధారావిలో సామాజిక దూరాన్ని పాటించడం దాదాపు అసాధ్యం. ఇక్కడ కనీసం తొమ్మిది కంటైన్‌మెంట్ జోన్‌లను గుర్తించినట్టు ఓ అధికారి తెలిపారు. ఇంకొన్ని గుర్తించాల్సి ఉన్నదని పేర్కొన్నారు.
Tags:coronanvirus, pandemic, slum, dharavi, cases, deaths, crossed 100