ఇక మాస్కులు పెట్టాల్సిందే.. కరోనాపై సర్కార్ అలర్ట్

కరోనా మహమ్మారి అంతరించి పోయిందని ఇప్పుడిప్పుడే ఉపశమనం పొందుతున్న ప్రజలకు మరో చేదు వార్త ఎదురైంది.

Update: 2023-12-18 16:01 GMT

దిశ, వెబ్‌డెస్క్: కరోనా మహమ్మారి అంతరించి పోయిందని ఇప్పుడిప్పుడే ఉపశమనం పొందుతున్న ప్రజలకు మరో చేదు వార్త ఎదురైంది. చాపకింద నీరులా దేశ వ్యాప్తంగా మళ్లీ మహమ్మారి విస్తరిస్తోంది. దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కోవిడ్ కేసులు పెరగడం, కేరళ రాష్ట్రంలో కొత్త వేరియంట్ వెలుగుచూసిన క్రమంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కరోనా ఉధృతి సమయంలో తీసుకున్న జాగ్రత్తలు మరోసారి తీసుకోవాలని అన్ని రాష్ట్రాలను హెచ్చరిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.

రానున్న పండగల సీజన్‌లో కరోనా వైరస్ కట్టడి చర్యలను ముమ్మరంగా చేపట్టాలని రాష్ట్రాలకు సూచించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇచ్చిన సూచనల మేరకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్రాలకు కేంద్రం స్పష్టం చేసింది. అప్రమత్తంగా ఉంటూ కొత్త కేసులపై నిఘా ఉంచాలని ఆదేశించింది. ఆర్టీపీసీఆర్ టెస్టులు ఎక్కువ సంఖ్యలో చేయాలని.. వేరియంట్ తెలుసుకునేందుకు జీనోమ్ సీక్వెన్స్ టెస్టులు నిర్వహించాలని సూచించింది. మరోవైపు కర్ణాటక ప్రభుత్వం కూడా కరోనాపై అప్రమత్తమైంది. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో 60 ఏళ్లు పైబడిన వారికి మాస్కులు తప్పనిసరి చేసింది.

Tags:    

Similar News