దూసుకొస్తున్న కొత్త వైరస్.. రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్రం

దిశ, వెబ్‌డెస్క్: కరోనా మహమ్మారి నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న భారత్‌కు మంకీపాక్స్ రూపంలో మరో ప్రమాదం పొంచిఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Update: 2022-05-24 05:15 GMT

దిశ, వెబ్‌డెస్క్: కరోనా మహమ్మారి నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న భారత్‌కు మంకీపాక్స్ రూపంలో మరో ప్రమాదం పొంచిఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది విస్తృతంగా వ్యాప్తి చెందుతూ.. దాదాపు 14 రోజుల వ్యవధిలోనే ఏకంగా 14 దేశాలకు పాకి కలకలం రేపుతోంది. ప్రస్తుతం ఈ వైరస్ భారత్‌ను టెన్షన్‌ పెడుతోంది. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. ఇప్పటికే మహారాష్ట్రంలోని ముంబై నగరంలో 28 పడకలతో ప్రత్యేకంగా ఐసోలేషన్ వార్డును ఏర్పాటు చేశారు. మంకీపాక్స్ సస్పెక్ట్ రోగులను ఈ వార్డులో ఉంచనున్నట్లు అధికారులు వెల్లడించారు. కాగా, ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటివరకు వందకు పైగా కేసులు నమోదైనట్లు సమాచారం.


Similar News