భారీగా పెరుగుతున్న కరోనా కేసులు.. అప్రమత్తమైన ఆరోగ్యశాఖ

దేశంలో కరోనా కేసులు రోజురోజుకు భారీగా పెరుగుతున్నాయి. ఇప్పటికే చిన్నవారి నుంచి పెద్దవారి వరకు చాలా మంది కరోనా బారిన పడి ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.

Update: 2023-04-07 05:35 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: దేశంలో మరోసారి కరోనా వైరస్ చాపకింద నీరులా వ్యాపిస్తోంది. రోజువారీ కేసుల సంఖ్య పెరిగిపోవడం ఆందోళనకు గురి చేస్తోంది. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 6,050 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శుక్రవారం వెల్లడించింది.

వైరస్ బారిన పడి దేశంలో నిన్న ఒక్కరోజే 14 మంది మృత్యువాత పడ్డారు. పాజిటివ్ కేసుల సంఖ్య అంతకు ముందు రోజుతో పోలిస్తే 13 శాతం పెరిగాయని అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 28,303 యాక్టివ్ కేసులు ఉండగా ఇప్పటి వరకు చనిపోయిన వారి సంఖ్య 5,30,943 కు చేరుకుంది. మహమ్మారి విస్తరిస్తున్నందున కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ఈరోజు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ఆరోగ్యశాఖ మంత్రులతో సమీక్ష నిర్వహించబోతున్నారు. 

Tags:    

Similar News