సమాజ సేవకుడికి కరోనా వారియర్స్ అవార్డు ప్రదానం
దిశ, అర్వపల్లి : కొవిడ్ విజృంభిస్తున్న వేళ పేదలకు అండగా నిలిచి సేవలు అందించిన సామాజిక ఉద్యమకారుడు, తిమ్మాపురం మాజీ సర్పంచ్ జీడి వీరస్వామిని కరోనా వారియర్స్ అవార్డు వరించింది. ఆదివారం హైదరాబాద్‌లోని బిర్లా సైన్స్ సెంటర్‌లో ఐ ఫౌండేషన్ వారు అందించిన ఈ అవార్డును జీడి వీరస్వామి హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ చేతులమీదుగా అందుకున్నారు. కరోనా కష్టకాలంలో ప్రజలకు అండగా నిలిచి సేవలు అందించినందుకుగాను ఈ అవార్డును అందజేయడంతో పాటు ఘనంగా సన్మానించారు. పేద […]
దిశ, అర్వపల్లి : కొవిడ్ విజృంభిస్తున్న వేళ పేదలకు అండగా నిలిచి సేవలు అందించిన సామాజిక ఉద్యమకారుడు, తిమ్మాపురం మాజీ సర్పంచ్ జీడి వీరస్వామిని కరోనా వారియర్స్ అవార్డు వరించింది. ఆదివారం హైదరాబాద్‌లోని బిర్లా సైన్స్ సెంటర్‌లో ఐ ఫౌండేషన్ వారు అందించిన ఈ అవార్డును జీడి వీరస్వామి హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ చేతులమీదుగా అందుకున్నారు. కరోనా కష్టకాలంలో ప్రజలకు అండగా నిలిచి సేవలు అందించినందుకుగాను ఈ అవార్డును అందజేయడంతో పాటు ఘనంగా సన్మానించారు.
పేద కుటుంబానికి చెందిన జీడి వీరస్వామి.. సుజాత సూరేపల్లి వాలెంటీర్ ఫర్ కొవిడ్-19 ఫ్రెండ్స్ అసోసియేషన్ సహకారంతో జిల్లాలో వివిధ సేవా కార్యక్రమాలు చేపట్టారు. తిమ్మాపురం సర్పంచ్‌గానూ గతంలో సేవలు అందించారు. ఆయన సేవలను గుర్తించిన ఐ ఫౌండేషన్ కరోనా వారియర్స్ అవార్డును ప్రదానం చేసి సత్కరించింది. ఈ కార్యక్రమంలో ఐ ఫౌండేషన్ అధ్యక్షుడు సుతారపు రవీందర్, నెల్లూరు ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్య తదితరులు పాల్గొన్నారు.