కరోనా.. వుహాన్ ల్యాబ్‌లో పుట్టింది కాదు : WHO

వుహాన్: కరోనా వైరస్ చైనా ల్యాబ్ నుంచి లీక్ అయి ఉండకపోవచ్చునని, అది జంతువుల నుంచి మనుషులకు సోకి ఉండవచ్చునని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) నిపుణుల బృందం వెల్లడించింది. కరోనా పుట్టుకను దర్యాప్తు చేయడానికి డబ్ల్యూహెచ్‌వో బృందం అధికారికంగా తొలి కేసు నమోదైన చైనాలోని వుహాన్‌కు వెళ్లింది. తమ ప్రాథమిక అంచనాల ప్రకారం ఈ వైరస్ ముందుగా ఒక జీవిలో ఉండి తర్వాత మనుషులకు సోకినట్టుగా తెలుస్తున్నదని డబ్ల్యూహెచ్‌వో ఫుడ్ సేఫ్టీ, యానిమల్ డిసీజెస్ నిపుణులు పీటర్ […]

Update: 2021-02-09 11:38 GMT

వుహాన్: కరోనా వైరస్ చైనా ల్యాబ్ నుంచి లీక్ అయి ఉండకపోవచ్చునని, అది జంతువుల నుంచి మనుషులకు సోకి ఉండవచ్చునని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) నిపుణుల బృందం వెల్లడించింది. కరోనా పుట్టుకను దర్యాప్తు చేయడానికి డబ్ల్యూహెచ్‌వో బృందం అధికారికంగా తొలి కేసు నమోదైన చైనాలోని వుహాన్‌కు వెళ్లింది. తమ ప్రాథమిక అంచనాల ప్రకారం ఈ వైరస్ ముందుగా ఒక జీవిలో ఉండి తర్వాత మనుషులకు సోకినట్టుగా తెలుస్తున్నదని డబ్ల్యూహెచ్‌వో ఫుడ్ సేఫ్టీ, యానిమల్ డిసీజెస్ నిపుణులు పీటర్ బెన్ ఎంబ్రెక్ తెలిపారు. దీనిపై ఇంకా క్షుణ్ణంగా అధ్యయనం చేయాల్సి ఉన్నదని చెప్పారు. తమకు లభించిన ఆధారాల ప్రకారం ఒక ల్యాబ్ నుంచి మనిషికి ఈ వైరస్ సోకి ఉండే అవకాశాల్లేవని పేర్కొన్నారు. శీతల ఉత్పత్తుల వర్తకం ద్వారా ఈ వైరస్ వ్యాప్తి చెంది ఉండే అవకాశమున్నదని వివరించారు.

Tags:    

Similar News