కరోనా వైరస్ సంగీతం… మీరు విన్నారా?
దిశ, వెబ్‌డెస్క్: కరోనా వైరస్ నిర్మాణం ఆధారంగా మసాచ్యుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు ఓ సంగీతాన్ని తయారు చేశారు. కృత్రిమ మేధస్సు సాయంతో ఈ మ్యూజిక్‌ను సృష్టించారు. కరోనా వైరస్ నిర్మాణంలో ఉపరితలం మీద ప్రోటీన్ నిర్మిత స్పైకులు ఉంటాయి. వ్యాధి వేగంగా వ్యాప్తి చెందడానికి ఇవే ప్రధాన కారణం. వైరస్ మీద ఉన్న స్పైకులు మానవ శరీర కణాలతో అనుసంధానమైన వ్యాప్తిని వేగవంతం చేస్తాయి. ఇవి వైరస్ ప్రధాన భాగం మీద కిరీటాల్లో ఉండటంతో […]
దిశ, వెబ్‌డెస్క్: కరోనా వైరస్ నిర్మాణం ఆధారంగా మసాచ్యుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు ఓ సంగీతాన్ని తయారు చేశారు. కృత్రిమ మేధస్సు సాయంతో ఈ మ్యూజిక్‌ను సృష్టించారు. కరోనా వైరస్ నిర్మాణంలో ఉపరితలం మీద ప్రోటీన్ నిర్మిత స్పైకులు ఉంటాయి. వ్యాధి వేగంగా వ్యాప్తి చెందడానికి ఇవే ప్రధాన కారణం. వైరస్ మీద ఉన్న స్పైకులు మానవ శరీర కణాలతో అనుసంధానమైన వ్యాప్తిని వేగవంతం చేస్తాయి. ఇవి వైరస్ ప్రధాన భాగం మీద కిరీటాల్లో ఉండటంతో దీన్ని కరోనా అన్నారు. కరోనా అంటే లాటిన్ భాషలో కిరీటం అని అర్థం.
అయితే శాస్త్రవేత్తలు ఒక్కో స్పైకుకు, సంగీతంలోని ఒక్కో మ్యూజికల్ నోట్‌ని జత చేశారు. తర్వాత మొత్తం వైరస్ నిర్మాణాకృతిని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో ఓ మోడల్ సృష్టించి పూర్తి స్థాయి మ్యూజిక్‌ని తయారుచేశారు. దీన్ని https://soundcloud.com/user-275864738/viral-counterpoint-of-the-coronavirus-spike-protein-2019-ncov లింకులో వినొచ్చు.
ఉపయోగమేంటి?
సాధారణంగా మైక్రోస్కోప్‌కి దొరకని కొన్నింటిని శబ్దతరంగాల్లో వేరియేషన్ ద్వారా మానవ చెవి గ్రహించగలదు. అందుకే కరోనా నిర్మాణాన్ని సంగీతం రూపంలోకి మార్చి వినడం ద్వారా ఏదైనా వేరియేషన్ కొత్తది వినిపించే అవకాశం ఉండొచ్చని ప్రొఫెసర్ మార్కస్ బ్యులెర్ తెలిపారు. ముఖ్యంగా ప్రోటీన్లలో దాగి ఉన్న సమాచారాన్ని సంగీత వైబ్రేషన్ల ద్వారా సులభంగా మ్యాప్ చేయొచ్చని బ్యులెర్ వెల్లడించారు. అంతేకాకుండా ఇదే మ్యూజిక్‌కి కౌంటర్‌గా యాంటీ బాడీ మ్యూజిక్ తయారుచేసి చికిత్సకు మందు కనిపెట్టే అవకాశం కూడా ఉందని బ్యులెర్ వివరించారు.
Tags:corona, covid, music, notes, protein, spikes