కరోనా బాధితురాలి వివరాలు బహిర్గతం: యువకుడి అరెస్ట్

కరోనా బాధిత విద్యార్థిని ఫొటోను తన వాట్సాప్ స్టేటస్‌గా పెట్టుకున్నందుకు కటకటాల పాలయ్యాడు ఓ యువకుడు. ఈ ఘటన కర్నాటకలోని విజయపుర జిల్లాలో చోటుచేసుకుంది. నిందితుడు అనిల్ రాథోడ్(24) శనివారం బాధిత విద్యార్థిని ఫొటోను తన వాట్సాప్ స్టేటస్‌గా పెట్టుకొని ‘‘ బ్యాడ్ న్యూస్.. ఈ విద్యార్థినికి కరోనా సోకింది’’ అని రాసుకొచ్చాడు. ఈ విషయం చివరకు పోలీసుల దృష్టికి వెళ్లడంతో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. విద్యార్థిని పరువుకు భంగం కల్గించడంతోపాటు స్థానికంగా భయాందోళనలు సృష్టించేందుకు ప్రయత్నించాడని […]

Update: 2020-04-26 21:02 GMT

కరోనా బాధిత విద్యార్థిని ఫొటోను తన వాట్సాప్ స్టేటస్‌గా పెట్టుకున్నందుకు కటకటాల పాలయ్యాడు ఓ యువకుడు. ఈ ఘటన కర్నాటకలోని విజయపుర జిల్లాలో చోటుచేసుకుంది. నిందితుడు అనిల్ రాథోడ్(24) శనివారం బాధిత విద్యార్థిని ఫొటోను తన వాట్సాప్ స్టేటస్‌గా పెట్టుకొని ‘‘ బ్యాడ్ న్యూస్.. ఈ విద్యార్థినికి కరోనా సోకింది’’ అని రాసుకొచ్చాడు. ఈ విషయం చివరకు పోలీసుల దృష్టికి వెళ్లడంతో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. విద్యార్థిని పరువుకు భంగం కల్గించడంతోపాటు స్థానికంగా భయాందోళనలు సృష్టించేందుకు ప్రయత్నించాడని పోలీసులు తెలిపారు. కరోనా బాధితుల వివరాలు వెల్లడిస్తే తీవ్రమైన నేరంగా పరిగణిస్తామని, శిక్ష కూడా పడుతుందని పోలీసులు హెచ్చరించారు.

Tags: man arrest, whatsup status, carona Victims

Tags:    

Similar News