టీకాలు సురక్షితం : ప్రధాని మోడీ
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సొంత నియోజకవర్గం వారణాసిలో టీకా లబ్దిదారులు, వ్యాక్సినేటర్లతో ఆయన శుక్రవారం ముచ్చటించారు. టీకా సురక్షితమని భరోసానిచ్చారు. గతంలో టీకా ఎప్పుడు వస్తుందని చాలా మంది తనను అడిగేవారని అన్నారు. అది రాజకీయనేతల పనికాదని, శాస్త్రజ్ఞులు తేల్చాల్సిన పని అని వారికి వివరించినట్టు తెలిపారు. శాస్త్రవేత్తలు కష్టపడి వేగంగా టీకాను అభివృద్ధి చేశారని, వ్యాక్సిన్ సురక్షితమని చెప్పారు. టీకాల విషయంలో భారత్ స్వయం సమృద్ధతను సాధించిందని, ఏకంగా రెండు టీకాలను అందుబాటులోకి తీసుకువచ్చారని […]
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సొంత నియోజకవర్గం వారణాసిలో టీకా లబ్దిదారులు, వ్యాక్సినేటర్లతో ఆయన శుక్రవారం ముచ్చటించారు. టీకా సురక్షితమని భరోసానిచ్చారు. గతంలో టీకా ఎప్పుడు వస్తుందని చాలా మంది తనను అడిగేవారని అన్నారు. అది రాజకీయనేతల పనికాదని, శాస్త్రజ్ఞులు తేల్చాల్సిన పని అని వారికి వివరించినట్టు తెలిపారు. శాస్త్రవేత్తలు కష్టపడి వేగంగా టీకాను అభివృద్ధి చేశారని, వ్యాక్సిన్ సురక్షితమని చెప్పారు. టీకాల విషయంలో భారత్ స్వయం సమృద్ధతను సాధించిందని, ఏకంగా రెండు టీకాలను అందుబాటులోకి తీసుకువచ్చారని వివరించారు. వ్యాక్సినేషన్‌తో సంబంధమున్న వైద్యులు, పారామెడికల్ సిబ్బంది, పారిశుధ్య కార్మికులను ప్రశంసించారు.