టీకా వద్దంటున్న ప్రభుత్వ వైద్యుడు.. ఆయన దారిలోనే గిరిజనులు?

దిశ, మహాముత్తారం : కరోనా నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాక్సినేషన్ ఉద్యమాన్నిపెద్దఎత్తున చేపట్టాయి. డిసెంబర్ వరకు దేశంలో వంద కోట్ల ప్రజలకు పైగా వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని లక్ష్యాన్ని నిర్దేశించుకున్నది కేంద్రం. అయితే, నిరక్షరాస్యులు కూడా వ్యాక్సిన్ వేయించుకునేందుకు సుముఖత వ్యక్తం చేస్తుండగా, చదువుకుని గౌరవమైన వైద్య వృత్తిలో కొనసాగుతున్న ప్రభుత్వ వైద్యుడు వ్యాక్సిన్ వేయించుకునేందుకు సుముఖత వ్యక్తం చేయడం లేదు. అతనే భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండల ప్రభుత్వ వైద్యాధికారి. అసలే మారుమూల ప్రాంతం, […]

Update: 2021-09-29 01:23 GMT

దిశ, మహాముత్తారం : కరోనా నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాక్సినేషన్ ఉద్యమాన్నిపెద్దఎత్తున చేపట్టాయి. డిసెంబర్ వరకు దేశంలో వంద కోట్ల ప్రజలకు పైగా వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని లక్ష్యాన్ని నిర్దేశించుకున్నది కేంద్రం. అయితే, నిరక్షరాస్యులు కూడా వ్యాక్సిన్ వేయించుకునేందుకు సుముఖత వ్యక్తం చేస్తుండగా, చదువుకుని గౌరవమైన వైద్య వృత్తిలో కొనసాగుతున్న ప్రభుత్వ వైద్యుడు వ్యాక్సిన్ వేయించుకునేందుకు సుముఖత వ్యక్తం చేయడం లేదు. అతనే భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండల ప్రభుత్వ వైద్యాధికారి.

అసలే మారుమూల ప్రాంతం, చుట్టూ దట్టమైన అడవులు అధికభాగం నిరక్షరాస్యులైన ఆదివాసీ గిరిజన బిడ్డలే ఇక్కడ నివాసం ఉంటున్నారు. కొవిడ్ మహమ్మారి నివారణ కోసం ప్రభుత్వాలు కొవిడ్ వ్యాక్సినేషన్ ఉద్యమాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తూ ప్రజలకు టీకాలు వేస్తున్నారు. ఈ క్రమంలో మహాముత్తారం మండల ప్రజలకు కొవిడ్ వ్యాక్సినేషన్ పై అవగాహన కల్పించి ఆదర్శంగా ఉండాల్సిన వైద్యాధికారి వ్యాక్సిన్ వేసుకోకుండా నిర్లక్ష్యం వహిస్తున్నాడు.

ప్రభుత్వం ఫ్రంట్ లైన్ వారియర్స్ అయిన వైద్యులు, వైద్య సిబ్బంది, పోలీసులు, శానిటేషన్ వర్కర్లకు ముందుగా జనవరి నెల 20 నుంచి టీకాలు వేయించింది. రాష్ట్రంలోని ప్రతీ ఒక్క ఫ్రంట్ లైన్ వారియర్ టీకా వేయించుకుని ప్రజలలో ఉన్న భయాలు అనుమానాలను తొలగించేందుకు ప్రయత్నించారు. అయితే, ఫ్రంట్ లైన్ వారియర్స్‌లో భాగమైన మహాముత్తారం ప్రభుత్వ ప్రాథమిక ఆసుపత్రి వైద్యాధికారి గోపీనాథ్ మాత్రం ప్రభుత్వ ఆదేశాలను పాటించకుండా టీకా తీసుకోకపోవడం మండల ప్రజలను పలు అనుమానాలకు గురిచేస్తోంది. ప్రభుత్వ వైద్యుడే వ్యాక్సినేషన్‌కు దూరంగా ఉండటంతో కొందరు వ్యాక్సినేషన్ వేయించుకోవడానికి విముఖత చూపిస్తున్నారు. టీకా తీసుకోకుండా నిర్లక్ష్యం వహించిన కారణంగా సదరు వైద్యుడిపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

Tags:    

Similar News