త్వరలో చిన్నారులకు వ్యాక్సిన్

దిశ, వెబ్‌డెస్క్: ఇప్పటికే పెద్దలకు కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. కానీ చిన్నపిల్లలు కూడా కరోనా బారిన పడుతున్నారు. అయితే వారికి కరోనా వ్యాక్సిన్ అందుబాటులో లేదు. త్వరలో చిన్నారులకు కూడా కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది. ఈ మేరకు అనేక ఔషద సంస్థలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇప్పటికే చైనాకు చెందిన సినోవాక్ చిన్నారుల కోసం వ్యాక్సిన్ అభివృద్ధి చేస్తుండగా.. తాజాగా జర్మనీకి చెందిన బయోఎన్‌టెక్‌తో కలిసి ఫైజర్ అనే సంస్థ చిన్నారుల కోసం వ్యాక్సిన్ అభివృద్ధి […]

Update: 2021-03-26 20:53 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఇప్పటికే పెద్దలకు కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. కానీ చిన్నపిల్లలు కూడా కరోనా బారిన పడుతున్నారు. అయితే వారికి కరోనా వ్యాక్సిన్ అందుబాటులో లేదు. త్వరలో చిన్నారులకు కూడా కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది. ఈ మేరకు అనేక ఔషద సంస్థలు ప్రయత్నాలు చేస్తున్నాయి.

ఇప్పటికే చైనాకు చెందిన సినోవాక్ చిన్నారుల కోసం వ్యాక్సిన్ అభివృద్ధి చేస్తుండగా.. తాజాగా జర్మనీకి చెందిన బయోఎన్‌టెక్‌తో కలిసి ఫైజర్ అనే సంస్థ చిన్నారుల కోసం వ్యాక్సిన్ అభివృద్ధి చేస్తోంది. ఆరు నెలల వయస్సు ఉన్న చిన్నపిల్లలకు కూడా వ్యాక్సిన్ అందించేలా ప్రయోగాలు చేస్తున్నట్లు ఆ సంస్థ తెలిపింది.

ప్రస్తుతం క్లీనికల్ ట్రయల్స్ చేపడుతున్నామని, దాని కోసం వాలంటీర్లను ఎంపిక చేసినట్లు ఫైజర్ సంస్థ స్పష్టం చేసింది. 4,500 మంది వాలంటీర్లను ఎంపిక చేశామంది.

Tags:    

Similar News