హఫీజ్‌పేట్‌లో 18 మందికి వ్యాక్సిన్.. అంతా వారే
దిశ, శేరిలింగంపల్లి: హైదరాబాద్ హఫీజ్‌పేట్ ఏరియా ఆస్పత్రిలో కొవిషీల్డ్ వ్యాక్సిన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఇక్కడ 30 మందికి వ్యాక్సిన్ వేయాలని నిర్ణయించినప్పటికీ.. మధ్యాహ్నం 12 గంటల వరకు 18 మంది మాత్రమే వ్యాక్సిన్ వేయించుకున్నారు. అందులోనూ అంతా వైద్య సిబ్బందే వ్యాక్సిన్ వేయించుకున్నారు. హఫీజ్‌పేట్ ఏరియా ఆస్పత్రిలో స్టాప్ సూపర్‌వైజర్ సునీతకు మొదటి టీకా వేశారు. ఈ 18 మందిలో ఇద్దరు డాక్టర్లు, ఒక ఏఎన్‌ఎం, ఒక ఆశావర్కర్, నలుగురు స్టాఫ్ నర్సులు, ఇద్దరు అంగన్‌వాడీ టీచర్లు, […]
దిశ, శేరిలింగంపల్లి: హైదరాబాద్ హఫీజ్‌పేట్ ఏరియా ఆస్పత్రిలో కొవిషీల్డ్ వ్యాక్సిన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఇక్కడ 30 మందికి వ్యాక్సిన్ వేయాలని నిర్ణయించినప్పటికీ.. మధ్యాహ్నం 12 గంటల వరకు 18 మంది మాత్రమే వ్యాక్సిన్ వేయించుకున్నారు. అందులోనూ అంతా వైద్య సిబ్బందే వ్యాక్సిన్ వేయించుకున్నారు. హఫీజ్‌పేట్ ఏరియా ఆస్పత్రిలో స్టాప్ సూపర్‌వైజర్ సునీతకు మొదటి టీకా వేశారు. ఈ 18 మందిలో ఇద్దరు డాక్టర్లు, ఒక ఏఎన్‌ఎం, ఒక ఆశావర్కర్, నలుగురు స్టాఫ్ నర్సులు, ఇద్దరు అంగన్‌వాడీ టీచర్లు, ఇద్దరు మెడికల్ అసిస్టెంట్లు, ఒక అకౌంటెంట్, మరో ఐదుగురు మెడికల్ సిబ్బంది వ్యాక్సిన్ వేయించుకున్నారు. ఈ వ్యాక్సిన్ వేయించుకున్న వారిలో ఒళ్లు నొప్పులు ఉన్నాయని, ఒక నర్సుకు జ్వరంగా ఉన్నట్లు వైద్య సిబ్బంది తెలిపారు.