దేశంలో తగ్గుముఖం పట్టిన కరోనా.. కొత్తగా ఎన్నికేసులంటే?

దిశ, వెబ్‌డెస్క్‌: గతకొద్ది నెలల క్రితం దేశాన్ని ఊపిరాడనివ్వకుండా చేసిన కరోనా మహమ్మారి కాస్త తగ్గుముఖం పట్టింది. పాజిటివ్ కేసులతో పాటు మరణాల సంఖ్య కూడా భారీగా తగ్గాయి. తాజాగా.. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 25,166 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 154 రోజుల తర్వాత ఇంత భారీ స్థాయిలో కరోనా కేసులు తగ్గాయని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 3,69,846 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. రికవరీ రేటు 97.51 శాతంగా ఉంది. […]

Update: 2021-08-16 23:24 GMT

దిశ, వెబ్‌డెస్క్‌: గతకొద్ది నెలల క్రితం దేశాన్ని ఊపిరాడనివ్వకుండా చేసిన కరోనా మహమ్మారి కాస్త తగ్గుముఖం పట్టింది. పాజిటివ్ కేసులతో పాటు మరణాల సంఖ్య కూడా భారీగా తగ్గాయి. తాజాగా.. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 25,166 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 154 రోజుల తర్వాత ఇంత భారీ స్థాయిలో కరోనా కేసులు తగ్గాయని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

దేశవ్యాప్తంగా ప్రస్తుతం 3,69,846 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. రికవరీ రేటు 97.51 శాతంగా ఉంది. అంతేగాకుండా.. కొత్తగా 437 మంది వైరస్ మూలంగా ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,22,50,679 కి చేరింది. మరణాల సంఖ్య 4,32,079 కి పెరిగింది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తం 3,14,48,754 మంది కోలుకున్నారు.

Tags:    

Similar News