నూతనకల్ పోలీస్ స్టేషన్‌లో కరోనా కలకలం

దిశ, సూర్యాపేట: నూతనకల్ పోలీస్ స్టేషన్ లో కరోనా కలకలం రేగింది. ముగ్గురు పోలీసులకు కరోనా సోకింది. వివరాల్లోకి వెళితే.. సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలంలోని స్థానిక పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న మరో ముగ్గురు పోలీసులకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. గత కొద్ది రోజుల నుంచి కరోనా లక్షణాలతో బాధపడుతున్న వీరికి కరోనా టెస్టులు చేశారు. ఈ టెస్టుల్లో కరోనా పాజిటివ్ గా తేలింది. ఈ విషయాన్ని మండల వైద్యాధికారి డాక్టర్ […]

Update: 2020-07-25 22:19 GMT

దిశ, సూర్యాపేట: నూతనకల్ పోలీస్ స్టేషన్ లో కరోనా కలకలం రేగింది. ముగ్గురు పోలీసులకు కరోనా సోకింది. వివరాల్లోకి వెళితే.. సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలంలోని స్థానిక పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న మరో ముగ్గురు పోలీసులకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది.

గత కొద్ది రోజుల నుంచి కరోనా లక్షణాలతో బాధపడుతున్న వీరికి కరోనా టెస్టులు చేశారు. ఈ టెస్టుల్లో కరోనా పాజిటివ్ గా తేలింది. ఈ విషయాన్ని మండల వైద్యాధికారి డాక్టర్ మురళి కృష్ణ వెల్లడించారు. మొదటగా ఓ వ్యక్తికి కరోనా సోకిందని, అతని ద్వారా ఈ ముగ్గురికి వ్యాపించినట్టు అధికారులు భావిస్తున్నారు.

Tags:    

Similar News