రెవెన్యూ శాఖలో కీలక అధికారికి కరోనా
దిశ ప్రతినిధి, ఖమ్మం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో మంగళవారం కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. మండల రెవెన్యూ శాఖలో కీలక బాధ్యతల్లో కొనసాగుతున్న సదరు అధికారికి ఐదు రోజులుగా గొంతునొప్పి, జ్వరం, ఒళ్ళు నొప్పులు ప్రారంభం కావడంతో బుధవారం స్థానిక పీహెచ్‌సీలో నిర్వహించిన రాపిడ్ ఆంటీజన్ టెస్ట్ చేయించుకున్నారు. ఈ టెస్టుల్లో ఆయన కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో ఆయనతో కాంటాక్టులో ఉన్న వారందరినీ హోం క్వారంటైన్‌లో […]
దిశ ప్రతినిధి, ఖమ్మం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో మంగళవారం కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. మండల రెవెన్యూ శాఖలో కీలక బాధ్యతల్లో కొనసాగుతున్న సదరు అధికారికి ఐదు రోజులుగా గొంతునొప్పి, జ్వరం, ఒళ్ళు నొప్పులు ప్రారంభం కావడంతో బుధవారం స్థానిక పీహెచ్‌సీలో నిర్వహించిన రాపిడ్ ఆంటీజన్ టెస్ట్ చేయించుకున్నారు. ఈ టెస్టుల్లో ఆయన కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.
దీంతో ఆయనతో కాంటాక్టులో ఉన్న వారందరినీ హోం క్వారంటైన్‌లో ఉండాలని అధికారులు ఆదేశించారు. ఆయన భద్రాచలంలో ఉంటూ చర్ల మండలంలో విధులకు హాజరవుతున్నారు. ఆయన జర్నీ హిస్టరీని అధికారులు ట్రేస్ చేసే పనిలో నిమగ్నమయ్యారు.