స్టార్ టెన్నీస్ ప్లేయర్ నోవాక్ జకోవిచ్‌కు కరోనా

దిశ, వెబ్‌ డెస్క్: ప్రపంచ దేశాలను కంటిమీద కునుకు లేకుండా చేస్తూ, రోజురోజుకూ విస్తృతంగా వ్యాప్తిచెందుతోంది కరోనా వైరస్. దీని మూలంగా ఇప్పటికే అన్ని రకాల అంతర్జాతీయ క్రీడలు రద్దు చేయబడ్డాయి. అయినా సరే ఎవరినీ వదలకుండా ఇప్పటికే ముగ్గురు పాకిస్తాన్ క్రికెటర్లు కరోనా వైరస్ బారినపడ్డ విషయం తెలిసిందే. అంతేకాకుండా గ్రిగోర్ దిమిత్రోవ్, బోర్నా కొరిచ్ లాంటి స్టార్ టెన్నీస్ ప్లేయర్లకు ఇప్పటికే కరోనా సోకింది. తాజాగా స్టార్ టెన్నీస్ ప్లేయర్ నోవాక్ జకోవిచ్‌కు కరోనా […]

Update: 2020-06-23 07:58 GMT

దిశ, వెబ్‌ డెస్క్: ప్రపంచ దేశాలను కంటిమీద కునుకు లేకుండా చేస్తూ, రోజురోజుకూ విస్తృతంగా వ్యాప్తిచెందుతోంది కరోనా వైరస్. దీని మూలంగా ఇప్పటికే అన్ని రకాల అంతర్జాతీయ క్రీడలు రద్దు చేయబడ్డాయి. అయినా సరే ఎవరినీ వదలకుండా ఇప్పటికే ముగ్గురు పాకిస్తాన్ క్రికెటర్లు కరోనా వైరస్ బారినపడ్డ విషయం తెలిసిందే. అంతేకాకుండా గ్రిగోర్ దిమిత్రోవ్, బోర్నా కొరిచ్ లాంటి స్టార్ టెన్నీస్ ప్లేయర్లకు ఇప్పటికే కరోనా సోకింది. తాజాగా స్టార్ టెన్నీస్ ప్లేయర్ నోవాక్ జకోవిచ్‌కు కరోనా పాజిటివ్ వచ్చినట్టు నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని స్వయంగా జకోవిచ్ వెల్లడించారు. తనతోపాటు తన భార్యకు కూడా పాజిటివ్ ఉన్నట్టు, పిల్లలకు మాత్రం నెగిటివ్ ఉన్నట్టు తెలిపారు.

Tags:    

Similar News