మెదక్‌లో భారీగా పెరుగుతున్న కేసులు.. థర్డ్ వేవ్ సంకేతాలు.?
దిశ ప్రతినిధి, మెదక్ : ఉమ్మడి మెదక్ జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థలు కరోనా థర్డ్ వేవ్ ప్రారంభ దశలో ఉందని హెచ్చరిస్తున్నారు. అయినా జిల్లా ప్రజల్లో ఏ మాత్రం భయం కన్పించడం లేదు. ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు మాస్కులు ధరించడం లేదు. సామాజిక దూరం పాటించడం లేదు. ఇలాగైతే కరోనా థర్డ్ వేవ్ రాక తప్పదని పలువురు హెచ్చరిస్తున్నారు. థర్డ్ వేవ్‌కి సంకేతాలు.. ఉమ్మడి మెదక్ జిల్లాలో కరోనా మొదటి […]
దిశ ప్రతినిధి, మెదక్ : ఉమ్మడి మెదక్ జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థలు కరోనా థర్డ్ వేవ్ ప్రారంభ దశలో ఉందని హెచ్చరిస్తున్నారు. అయినా జిల్లా ప్రజల్లో ఏ మాత్రం భయం కన్పించడం లేదు. ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు మాస్కులు ధరించడం లేదు. సామాజిక దూరం పాటించడం లేదు. ఇలాగైతే కరోనా థర్డ్ వేవ్ రాక తప్పదని పలువురు హెచ్చరిస్తున్నారు.
థర్డ్ వేవ్‌కి సంకేతాలు..
ఉమ్మడి మెదక్ జిల్లాలో కరోనా మొదటి వేవ్, సెకండ్ వేవ్‌లో మొత్తంగా సుమారు లక్ష మంది వరకు కరోనా బారిన పడ్డారు. సుమారు వంద మందికి పైగానే మృత్యువాత పడ్డారు. ప్రస్తుతం గత నెల రోజులుగా ఉమ్మడి మెదక్ జిల్లాలో కరోనా కేసులు తగ్గినా మళ్లీ ప్రారంభమయ్యాయి. మొన్నటి వరకు ఒక్క అంకెకు పరిమితమైన పాజిటివ్ కేసులు మళ్లీ రెండెంకలకు చేరుకున్నాయి. శనివారం ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా 51 కేసులు నమోదైనట్టు వైద్యాధికారులు తెలిపారు. సిద్దిపేట జిల్లాలో అత్యధికంగా 34 కొవిడ్ కేసులు నమోదు కాగా మెదక్ జిల్లాలో 10 మంది, సంగారెడ్డి జిల్లాలో ఏడుగురు కరోనా బారిన పడ్డారు. ఇది కరోనా థర్డ్ వేవ్‌కు సంకేతాలేనని పలువురు వైద్య నిపుణులు అంచనా వేస్తున్నారు.
కొవిడ్ నిబంధనలు బేఖాతర్..
ఇంటి నుంచి బయటకు వెళ్లే ప్రతీ ఒక్కరు మాస్కు తప్పని సరిగా ధరించాలని ప్రభుత్వం ఆదేశించి.. రూ. వెయ్యి జరిమానా విధించినా ఎవరూ అంతగా కేర్ చేయడం లేదు. కరోనా థర్డ్ వేవ్ ముప్పు బాగానే ఉంటుందని, గాలిలో వైరస్ బాగా విస్తరిస్తుందని హెచ్చరిస్తున్నా.. చాలా మంది మాస్కులు లేకుండానే తిరుగుతున్నారు. బహిరంగ ప్రదేశాల్లో గుమ్మిగూడి ఉండకూడదని చెబుతున్నా ఎవ్వరు వినడం లేదు. ముఖ్యంగా యువత మాస్కు ధరించకుండానే యథేచ్చగా తిరుగుతున్నారు. ఇదే విధంగా నిర్లక్ష్యం కొనసాగితే ఉమ్మడి మెదక్ జిల్లాలో కరోనా థర్డ్ వేవ్ రావడం ఖాయం.. చాలా మంది కరోనా బారిన పడటం ఖాయమని వైద్యాధికారులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా కరోనా థర్డ్ వేవ్ నుంచి తప్పించుకోవాలంటే నిర్లక్ష్యం వీడి కొవిడ్ నిబంధనలు పాటించాలని జిల్లా వైద్యాధికారులు కోరుతున్నారు.