పెద్ద ఎత్తున టెస్టులకు రెడీ : టీఎస్ ప్రభుత్వం
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో పెద్ద ఎత్తున కరోనా టెస్టులు చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలంగాణ ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. టెస్టులు సరిగా చేయడం లేదని బీజేపీ పదేపదే ఆరోపిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టం చేసింది. ఎన్నటికీ కొవిడ్-19 పరీక్షల విషయంలో వెనకడుగు వేసేది లేదని ప్రభుత్వం తెలిపింది.ఇప్పటికే కరోనా టెస్టింగ్ మిషిన్ల కోసం తాము ఆర్డర్ ఇచ్చామని..దానికి సంబంధించిన డాక్యూమెంట్లను ప్రభుత్వం మీడియాకు విడుదల చేసింది. రానున్న రోజుల్లో టెస్టుల కోసం అయ్యే […]
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో పెద్ద ఎత్తున కరోనా టెస్టులు చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలంగాణ ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. టెస్టులు సరిగా చేయడం లేదని బీజేపీ పదేపదే ఆరోపిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టం చేసింది. ఎన్నటికీ కొవిడ్-19 పరీక్షల విషయంలో వెనకడుగు వేసేది లేదని ప్రభుత్వం తెలిపింది.ఇప్పటికే కరోనా టెస్టింగ్ మిషిన్ల కోసం తాము ఆర్డర్ ఇచ్చామని..దానికి సంబంధించిన డాక్యూమెంట్లను ప్రభుత్వం మీడియాకు విడుదల చేసింది. రానున్న రోజుల్లో టెస్టుల కోసం అయ్యే ఖర్చు విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడబోమని తెలిపింది. కాగా, రాష్ట్రంలో ప్రైవేటు, ప్రభుత్వ ఆస్పత్రుల్లో నిర్వహిస్తున్న టెస్టుల వలన రోజురోజుకూ కేసుల సంఖ్య అమాంతం పెరిగిపోతున్నది. ఎక్కువగా గ్రేటర్ పరిధిలోనే కేసులు వెలువడతుండటంతో నగరవాసులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.