ఆయుష్మాన్ భారత్‌లోకి 'కరోనా'

న్యూఢిల్లీ: ప్రభుత్వ బీమా పథకం ఆయుష్మాన్​ భారత్​లోకి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు, చికిత్సలను చేర్చాలని కేంద్రప్రభుత్వం యోచిస్తున్నట్టు తెలుస్తోంది.ఈ నిర్ణయం అమల్లోకి వస్తే పేద, మధ్య తరగతి ప్రజలకు ఈ మహమ్మారి నుంచి ఆరోగ్య భద్రత చేకూరినట్టవుతుంది. 2011 సాంఘిక, ఆర్థిక, కుల జనాభా లెక్కల ప్రకారం, 10.74 కోట్లకు పైగా పేద, బలహీన కుటుంబాలకు పీఎంజేఏవై పథకం కింద లబ్ది చేకూర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు స్పష్టమవుతోంది. ఈ పథకం కింద లబ్దిదారుల కుటుంబానికి ఏటా […]

Update: 2020-03-24 09:49 GMT

న్యూఢిల్లీ: ప్రభుత్వ బీమా పథకం ఆయుష్మాన్​ భారత్​లోకి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు, చికిత్సలను చేర్చాలని కేంద్రప్రభుత్వం యోచిస్తున్నట్టు తెలుస్తోంది.ఈ నిర్ణయం అమల్లోకి వస్తే పేద, మధ్య తరగతి ప్రజలకు ఈ మహమ్మారి నుంచి ఆరోగ్య భద్రత చేకూరినట్టవుతుంది. 2011 సాంఘిక, ఆర్థిక, కుల జనాభా లెక్కల ప్రకారం, 10.74 కోట్లకు పైగా పేద, బలహీన కుటుంబాలకు పీఎంజేఏవై పథకం కింద లబ్ది చేకూర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు స్పష్టమవుతోంది. ఈ పథకం కింద లబ్దిదారుల కుటుంబానికి ఏటా రూ.5 లక్షల ఉచిత చికిత్సా సదుపాయం అందుతుంది.

tags:coronavirus, covid-19, central government, PM, corona treatment, ayushman bharat

Tags:    

Similar News