ప్రైవేట్ ఆసుపత్రుల్లో కరోనా టెస్టు ధర రూ. 2200 : మంత్రి ఈటల
దిశ, వెబ్ డెస్క్: ప్రైవేట్ ఆసుపత్రుల్లో కరోనా టెస్టు ధర రూ. 2200 అని మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. సోమవారం ఆయన అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లాక్ డౌన్ ఎత్తివేసినంక రాష్ట్రంలో కేసులు పెరుగుతున్నాయన్నారు. కరోనా కట్టడికి అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నామన్నారు. హైదరాబాద్ లో సామాజిక వ్యాప్తి లేదని కేంద్రం ప్రకటించిందని, ఐసీఎంఆర్ సూచనల మేరకు నడుచుకుంటున్నామన్నారు. ఐసీఎంఆర్ మార్గదర్శకాలకు అనుగుణంగా పరీక్షలు నిర్వహిస్తున్నామని, ఏ మాత్రం అనుమానం ఉన్నా […]
దిశ, వెబ్ డెస్క్: ప్రైవేట్ ఆసుపత్రుల్లో కరోనా టెస్టు ధర రూ. 2200 అని మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. సోమవారం ఆయన అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లాక్ డౌన్ ఎత్తివేసినంక రాష్ట్రంలో కేసులు పెరుగుతున్నాయన్నారు. కరోనా కట్టడికి అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నామన్నారు. హైదరాబాద్ లో సామాజిక వ్యాప్తి లేదని కేంద్రం ప్రకటించిందని, ఐసీఎంఆర్ సూచనల మేరకు నడుచుకుంటున్నామన్నారు. ఐసీఎంఆర్ మార్గదర్శకాలకు అనుగుణంగా పరీక్షలు నిర్వహిస్తున్నామని, ఏ మాత్రం అనుమానం ఉన్నా పరీక్షలు చేస్తామన్నారు. అదేవిధంగా ప్రైవేట్ ఆసుపత్రుల్లో కరోనా టెస్టులు చేసేందుకు ధర నిర్ణయించామని, ఒక టెస్టు ధర రూ. 2200 అని, వెంటిలేటర్ పై చికిత్స అందిస్తే రోజుకు రూ. 9 వేలు అని, వెంటిలేటర్ లేకుండా చికిత్స అందిస్తే రోజుకు రూ. 7500 గా ధర నిర్ధారించినట్లు మంత్రి తెలిపారు.