టీఆర్ఎస్ నేతల్లో కరోనా టెన్షన్..

దిశ, తెలంగాణ బ్యూరో : కరోనా ఉధృతి పెరుగుతుండటంతో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న నేతల్లో టెన్షన్ మొదలైంది. కార్పొరేషన్ల పరిధిలో రోజూ వందల సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో తమకు ఎక్కడ సోకుతుందో.. కుటుంబానికి దూరం అవుతామేమోననే ఆందోళన మొదలైంది. నాగార్జున సాగర్ ఘటనలకే పునరావృతం అవుతుందోమేనని లోలోన మదనపడుతున్నారు. కానీ పైకి మాత్రం ధీమాగా ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఆదేశాలకు తిలోధకాలిస్తూ 20 మందికిపైగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్లలో రోజూకు వెయ్యికిపైగా […]

Update: 2021-04-21 11:04 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : కరోనా ఉధృతి పెరుగుతుండటంతో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న నేతల్లో టెన్షన్ మొదలైంది. కార్పొరేషన్ల పరిధిలో రోజూ వందల సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో తమకు ఎక్కడ సోకుతుందో.. కుటుంబానికి దూరం అవుతామేమోననే ఆందోళన మొదలైంది. నాగార్జున సాగర్ ఘటనలకే పునరావృతం అవుతుందోమేనని లోలోన మదనపడుతున్నారు. కానీ పైకి మాత్రం ధీమాగా ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఆదేశాలకు తిలోధకాలిస్తూ 20 మందికిపైగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్లలో రోజూకు వెయ్యికిపైగా కేసులు నమోదవుతున్నాయి. ఈ ప్రచారంతో మరింత పెరిగే అవకాశం ఉంది.

రాష్ట్రంలో రెండు కార్పొరేషన్, 5 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికల ప్రచారంలో గుంపులుగా కాకుండా వార్డుకు 5గురు మాత్రమే ప్రచారం చేయాలని, మాస్కులు, శానిటైజర్లు ఉపయోగించాలని ఎన్నికల కమిషన్ ఆదేశాలుజారీ చేసింది. కానీ అందుకు విరుద్ధంగా వార్డుకు 20 మందికిపైగా ప్రచారం, వందలాది మందితో ర్యాలీలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం ఖమ్మంలో వందలాది మందితో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఓ పక్క కరోనా కేసులు వందల సంఖ్యలో పెరుగుతున్న నేతలు మాత్రం తమ ప్రచారాన్ని నిర్వహించడం గమనార్హం.

ఖమ్మంలో 18 మైక్రో కంటైన్‌మెంట్ జోన్లు..

ప్రభుత్వం కరోనా నియంత్రణకు పకడ్బందీ చర్యలు చేపట్టింది. కేసులు అధికంగా నమోదవుతున్న జిల్లాల్లో మైక్రో కంటైన్ మెంట్ జోన్లను ప్రకటించింది. అందులో భాగంగా ఖమ్మంలో 18 జోన్లను ప్రకటించింది. ఒక జిల్లా కేంద్రాసుపత్రిలోనే 120 నుంచి 140కి పైగా కేసులు నమోదవుతున్నాయి. కార్పొరేషన్ పరిధిలో గత వారం రోజులుగా వందల సంఖ్యలో కేసులు నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. వరంగల్ జిల్లాలో సైతం కరోనా విజృంభిస్తోంది. ఏప్రిల్ 19న రూరల్, అర్బన్ లోనే 195 కేసులు, జిల్లాలో వందల సంఖ్యలో నమోదయ్యాయి. నల్లగొండ జిల్లాలో మార్చి 14న కేవలం 9 కేసులే ఉండేది. నాగార్జున సాగర్ నియోజకవర్గ ఉప ఎన్నికల ప్రచార సభలో సీఎం కేసీఆర్ పాల్గొన్న తర్వాత ఒక్క నియోజకవర్గ పరిధిలోనే ఏప్రిల్ 14న 102 కేసులు.. 19న 160 మందికి, 20న 250 కేసులు నమోదు అయ్యాయి. ప్రచారం నిర్వహించిన 16మందికి కరోనా వచ్చింది. ఈ ఘటనలు కార్పొరేషన్ల, మున్సిపాలిటీలలో కూడా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే ఎన్నికలు జరిగే కార్పొరేషన్, మున్సిపాలిటీల్లో ప్రచారం మొదలు కావడంతో నేతలతో పాటు ప్రజల్లో ఆందోళన నెలకొంది.

అయితే ప్రచారానికి నేతలు గుంపులుగా వెళ్తుండటంతో కరోనా ఎక్కడ సోకుతుందోనని కొంత మంది ఇంటి గేట్లకు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. తమను నేరుగా కలువొద్దని ఓటర్లు తేల్చి చెబుతున్నారు. ఒక వేళ కలిసినా భౌతిక దూరంలో ఉండి మాట్లాడి పంపించడంతో పాటు మళ్లీ రావద్దని కోరుతున్నారు. అందులో భాగంగా సిద్దిపేట మున్సిపాలిటీ పరిధిలోని 34వ వార్డులో ఓట్లు అడగడానికి మా ఇంట్లోకి రావద్దు.. కింది నెంబర్లకు ఫోన్ చేయండి అని ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. ఇదిలా ఉంటే అధికార టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎన్నికల కమిషన్ నిబంధనలకు తిలోధకాలిస్తూనే ఉన్నారు. చర్యలు తీసుకోవాల్సిన అధికారులు అండగా నిలుస్తున్నారు అందుకు నిదర్శనం ఖమ్మంలో బుధవారం నిర్వహించిన ర్యాలీయే. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఎన్నికలు జరిగే మున్సిపల్, కార్పొరేషన్లలో కోవిడ్ నిబంధనలు పకడ్బందీగా అమలయ్యేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

 

Tags:    

Similar News