అస్సలు తగ్గేదే లేదు.. కుక్కనైనా వదిలేది లేదు

దిశ, వెబ్‌డెస్క్: కరోనా దేశాన్ని పట్టి పీడిస్తుంది. రోజుకు లక్షల్లో కేసులు నమోదయ్యి రికార్డులు సృష్టిస్తుంది. ఇక కరోనా కట్టడికి ప్రభుత్వం శతవిధాలా ప్రయత్నిస్తుంది. కరోనా కట్టడిలో భాగంగానే లాక్ డౌన్ లు, నైట్ కర్ప్యూ లను అమలుచేస్తుంది. ఇలాంటి పరిస్థితితుల్లో ప్రజలు బయటికి రాకుండా కరోనా జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు ఎంత చెప్తున్నా, ఎక్కడోచోట, ఎవరో ఒకరు బయట తిరుగుతూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.దీంతో పోలీసులు వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. కరోనా నియమాలను ఉల్లంఘించినవారు ఎవరైనా […]

Update: 2021-05-06 04:12 GMT

దిశ, వెబ్‌డెస్క్: కరోనా దేశాన్ని పట్టి పీడిస్తుంది. రోజుకు లక్షల్లో కేసులు నమోదయ్యి రికార్డులు సృష్టిస్తుంది. ఇక కరోనా కట్టడికి ప్రభుత్వం శతవిధాలా ప్రయత్నిస్తుంది. కరోనా కట్టడిలో భాగంగానే లాక్ డౌన్ లు, నైట్ కర్ప్యూ లను అమలుచేస్తుంది. ఇలాంటి పరిస్థితితుల్లో ప్రజలు బయటికి రాకుండా కరోనా జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు ఎంత చెప్తున్నా, ఎక్కడోచోట, ఎవరో ఒకరు బయట తిరుగుతూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.దీంతో పోలీసులు వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. కరోనా నియమాలను ఉల్లంఘించినవారు ఎవరైనా సరే అరెస్టుచేసి కటకటాలవెనక్కి నెడుతున్నారు. అది మనుషులైనా, జంతువులైనా.. తాజాగా మధ్యప్రదేశ్ లో కరోనా నియమాలను ఉల్లంఘించిన ఓ కుక్కను పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో వేశారు. ఈ వింత ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలేంటంటే…

మధ్యప్రదేశ్ లో కరోనా కేసులు ఎక్కువ ఉండడంతో కొన్ని రోజుల నుండి కఠిన లాక్​ డౌన్​ అమల్లో ఉన్న విషయం తెలిసిందే. ఇక ఈ సమయంలో ఎవరు ఇంటినుండి అడుగుపెట్టినా పోలీసులు తమ ప్రతాపాన్ని చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇండోర్‌ లోని పలాసియా ప్రాంతంలో ఒక వ్యాపారవేత్త తన కుక్కను తీసుకొని వాకింగ్ కి బయటికి వచ్చాడు. అది చూసిన పోలీసులు అతనిని అరెస్ట్ చేశారు. ఇక్కడివరకు ఒకే.. కానీ పోలీసులు ఇంకొంచెం ముందుకెళ్లి వాకింగ్ కి వచ్చిన కుక్కను కూడా అరెస్ట్ చేసి జైల్లో వేశారు. ఇక కుక్క అరెస్టుపై జంతు ప్రేమికులు నిరసన వ్యక్తం చేశారు. మూగజీవానికి ఏం తెలుసు? యజమాని రమ్మంటే పాపం అది మాత్రం ఏం చేస్తుంది.. అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Tags:    

Similar News