బీ కేర్‌ఫుల్.. ఒక్కరి నుంచి 9 మందికి కరోనా వ్యాప్తి

దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో కరోనా సెకెండ్ వేవ్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. గత డిసెంబర్ నెలతో పోలిస్తే ఆల్ టైం గరిష్టానికి ప్రస్తుతం కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలను అప్రమత్తం చేసింది. వ్యాక్సినేషన్ ప్రక్రియను త్వరితగతిన చేపట్టాలని ఆదేశాలు జారీచేసింది. ప్రతిఒక్కరూ కొవిడ్-19రూల్స్ విధిగా పాటించాలని ఉత్తర్వులు వెలువడ్డాయి. ఇటీవల తెలంగాణలోనూ కరోనా కేసులు పెరుగుతుండటంతో మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ రమేష్ రెడ్డి స్పందించారు. ఒక్కరికీ కరోనా వస్తే వారి ద్వారా […]

Update: 2021-03-27 04:52 GMT

దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో కరోనా సెకెండ్ వేవ్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. గత డిసెంబర్ నెలతో పోలిస్తే ఆల్ టైం గరిష్టానికి ప్రస్తుతం కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలను అప్రమత్తం చేసింది. వ్యాక్సినేషన్ ప్రక్రియను త్వరితగతిన చేపట్టాలని ఆదేశాలు జారీచేసింది. ప్రతిఒక్కరూ కొవిడ్-19రూల్స్ విధిగా పాటించాలని ఉత్తర్వులు వెలువడ్డాయి.

ఇటీవల తెలంగాణలోనూ కరోనా కేసులు పెరుగుతుండటంతో మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ రమేష్ రెడ్డి స్పందించారు. ఒక్కరికీ కరోనా వస్తే వారి ద్వారా 8 నుంచి 9 మందికి కరోనా వ్యాప్తి చెందే అవకాశ ముందన్నారు. లక్షణాలు లేకున్నా కరోనా సోకుతుందన్నారు. ఇలాంటి కఠిన పరిస్థితుల్లో వేడుకలకు హాజరుకాకపోవడం మంచిదని రమేష్ రెడ్డి సూచించారు. రాష్ట్రంలో కేసులు పెరిగినా అందుకు అవసరమైన మందులు, కిట్స్ సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. తొందరపడి ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లి డబ్బులు వృథా చేసుకోవద్దని.. హైదరాబాద్ 0.7శాతం మాత్రమే తెలంగాణలో వ్యా్క్సిన్ వేస్టేజీ జరుగుతోందని వివరించారు.

Tags:    

Similar News